News January 14, 2025

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జరిగే కాంగ్రెస్ జాతీయ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత మరుసటి రోజు సింగపూర్ వెళ్లనున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు అక్కడే పర్యటించనున్నారు. అనంతరం ఈ నెల 20న వరల్డ్ ఎకానమీ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు వెళ్తారు. ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ రానున్నారు.

Similar News

News January 14, 2025

‘ప్లేయర్ ఆఫ్ ది డిసెంబర్’గా బుమ్రా

image

BGTలో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైన స్టార్ బౌలర్ బుమ్రా మరో ఘనత సాధించారు. డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును సొంతం చేసుకున్నారు. గత నెలలో 3 మ్యాచ్‌లలోనే బుమ్రా 22 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. మహిళల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నారు.

News January 14, 2025

లండన్‌ పర్యటనకు బయలుదేరిన జగన్‌

image

మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్‌ పర్యటనకు బయలుదేరారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన లండన్ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి King’s College Londonలో ఎంఎస్‌, ఫైనాన్స్‌ కోర్సులో డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఆమె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి జగన్‌ దంపతులు హాజరుకానున్నారు. 16న డిగ్రీ ప్రదానోత్సవం జరగనుంది. అనంతరం నెలాఖరున జగన్‌ లండన్‌ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.

News January 14, 2025

మరికాసేపట్లో మకరజ్యోతి

image

మరికాసేపట్లో శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తరించేందుకు అయ్యప్ప మాలధారులు, భక్తులు భారీగా శబరిమలకు చేరుకున్నారు. భక్తుల శరణుఘోషతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.