News August 20, 2025

ఢిల్లీకి CM రేవంత్.. రేపటి OU పర్యటన వాయిదా

image

TG: సీఎం రేవంత్‌రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ సందర్భంగా రేవంత్ సైతం ఢిల్లీకి వెళ్లాల్సి రావడంతో ఆయన ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన వాయిదా పడింది. ఓయూ క్యాంపస్‌లో నిర్మించిన కొత్త హాస్టల్ భవనాలు, ఇతర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఈ నెల 21న రేవంత్ ఉస్మానియాకు వెళ్లాల్సి ఉంది.

Similar News

News August 20, 2025

ప్రైవేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్ తేవాలి: కాంగ్రెస్

image

SC, ST, OBC విద్యార్థులకు ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్స్ కల్పించేలా కేంద్రం చట్టం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. స్టాండింగ్ కమిటీ సిఫార్సు మేరకు SC విద్యార్థులకు 15%, STలకు 7.5%, OBCలకు 27% రిజర్వేషన్ కల్పించాలని కోరింది. ‘ప్రస్తుతం బంతి కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. ఇకపై SC, ST, OBCల డిమాండును కేంద్రం తోసిపుచ్చలేదు’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు.

News August 20, 2025

అగ్ని-5 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం

image

ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ అగ్ని-5ను భారత్ విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఒడిశా చందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మిస్సైల్‌ను పరీక్షించారు. ఈ లాంఛ్ అన్ని ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్స్‌ను రీచ్ అయినట్లు పేర్కొంది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహించారు. ఇది ఇండియన్ ఆర్మీకి బిగ్గెస్ట్ అసెట్ కానుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

News August 20, 2025

సినీ రంగంలోనూ AI ప్రభావం.. నటీనటులకు గడ్డుకాలమేనా?

image

ఉద్యోగుల్లో భయాన్ని రేకెత్తిస్తోన్న AI ఇప్పుడు సినీ ఫీల్డ్‌నూ తాకింది. ఇప్పటికే పూర్తిగా ఏఐ ద్వారా రూపొందించిన ‘మహావతార్ నరసింహ’ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో నటీనటులు లేకపోయినా భావోద్వేగాలను సృష్టించొచ్చు అని ఇది నిరూపించింది. ఈక్రమంలో ఏఐతో సినిమాలు తీయడంపై బాలీవుడ్ దృష్టి పెడుతోంది. రామాయణ్, చిరంజీవి హనుమాన్ వంటి చిత్రాలను ఏఐతో రూపొందిస్తోంది. దీనిపై మీ కామెంట్?