News April 8, 2025
నేడు గుజరాత్‌కు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఈరోజు గుజరాత్‌కు వెళ్లనున్నారు. అహ్మదాబాద్‌లో 2 రోజుల పాటు జరిగే ఏఐసీసీ ప్రత్యేక సమావేశాలకు ఆయన హాజరవనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి నిన్నే అక్కడికి చేరుకోగా మంత్రులతో కలిసి సీఎం నేడు పయనమవుతారు. బీసీ కులగణన, రిజర్వేషన్ల పెంపు తీర్మానంపై సీఎం ప్రసంగిస్తారని తెలుస్తోంది. రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో రేవంత్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.
Similar News
News January 29, 2026
భారీ జీతంతో ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News January 29, 2026
పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

పసిపిల్లల్లో కడుపునొప్పి వివిధ కారణాల వల్ల వస్తుంది. సాధారణంగా వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, నులి పురుగులు, కోలిక్ సమస్య వల్ల చిన్నారుల్లో కడుపునొప్పి వస్తుంది. సాధారణంగా ఇవి రెండురోజుల్లో తగ్గిపోతాయి. తగ్గకపోగా విరేచనాలు, వాంతులు కూడా అవుతుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఇంట్లో ఉండి నాటు వైద్యాలు చేయడం వల్ల పరిస్థితి ప్రమాదకరంగా మారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News January 29, 2026
పిల్లల్లో నొప్పులను ఎలా గుర్తించాలంటే?

నెలల పిల్లలు నొప్పి వచ్చినపుడు కళ్లు గట్టిగా మూసుకుంటారు. నోరు వెడల్పుగా తెరుస్తారు. నుదురు చిట్లిస్తారు. ముక్కు రంధ్రాలను వేగంగా కదిలిస్తారు. చెవిలో నొప్పి పుడుతుంటే చెవులు లాక్కొంటారు. తలనొప్పిగా ఉంటే తలను ఒక వైపు నుంచి మరోవైపునకు తిప్పుకుంటారు. ఒకేవైపు పడుకొని, కాళ్లు పొట్టలోకి ముడుచుకొంటారు. నొప్పి ఉన్న భాగాన్ని కదల్చకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారని నిపుణులు చెబుతున్నారు.


