News September 10, 2025
నేడు రక్షణ శాఖ మంత్రితో సీఎం రేవంత్ భేటీ

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న CM రేవంత్ ఇవాళ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని రక్షణ శాఖ భూముల బదలాయింపుపై విజ్ఞప్తులు చేయనున్నారు. కరీంనగర్, రామగుండం కనెక్టివిటీ కోసం, HYDలో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం డిఫెన్స్ మినిస్ట్రీ భూములను ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. వీటితో పాటు సైనిక్ స్కూల్ ఏర్పాటుపైనా చర్చించనున్నారు. అనంతరం HYDకు తిరిగి వస్తారు.
Similar News
News September 10, 2025
వీటిని రోజూ వాడుతున్నారా?

అమ్మాయిలు ఎన్నో బ్యూటీప్రోడక్ట్స్ వాడతారు. వాటిలో కొన్నిటిని రోజూ వాడితే ఇబ్బందులొస్తాయంటున్నారు నిపుణులు. వాటర్‌ప్రూఫ్ మస్కారా రోజూ వాడితే కనురెప్పలు పొడిబారిపోతాయి. చర్మాన్ని వారానికి రెండుసార్లే స్క్రబ్ చెయ్యాలి. లేదంటే పొడిబారి నిర్జీవంగా మారుతుంది. డీప్ కండీషనర్స్ రోజూ వాడితే కేశాల్లోని పీహెచ్ స్థాయులపై ప్రభావం చూపి నిర్జీవంగా మారుస్తుంది. కాబట్టి వీటిని పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు.
News September 10, 2025
కాసేపట్లో వర్షం

TG: కాసేపట్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వానలు పడతాయని అంచనా వేసింది.
News September 10, 2025
తమలపాకుతో మోముకు తాజాదనం

అందంగా కనిపించేందుకు అమ్మాయిలు రసాయన ఉత్పత్తులు వాడటం కంటే సహజసిద్ధంగా దొరికే తమలపాకు వాడటం మంచిదంటున్నారు సౌందర్య నిపుణులు. తమలపాకును మెత్తగా నూరి పసుపు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గి, చర్మం మృదువుగా మారుతుంది. తమలపాకులు మరిగించిన నీటిలో తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే తాజాగా కనిపిస్తుంది. స్నానం చేసే నీటిలో తమలపాకు నూనె వేసుకొని చేస్తే చెమటవాసన తగ్గుతుంది.