News January 9, 2025
రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం
TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కలెక్టర్లతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి తర్వాత పలు పథకాలను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు విషయంలో ఆయన వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 10, 2025
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు శ్రీమహావిష్ణువును దర్శించుకునేందుకు 3కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్తారు. అనంతరం వారితో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. పవిత్రమైన ఈరోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి. ఇవాళ ఉపవాసం ఉంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. మీకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.
News January 10, 2025
భార్యాభర్తలూ.. పిల్లల ముందు ఈ పనులు వద్దు
ఐదేళ్ల లోపు చిన్నారులు మనం మాట్లాడే మాటలు, చేసే పనులను చూసి చాలా నేర్చుకుంటారు. అందుకే వారి ముందు ఆర్థిక సమస్యల గురించి చర్చించుకోకండి. వారికేం అర్థమవుతుందిలే అనుకోవద్దు. అలాగే గట్టిగా అరుచుకుంటూ గొడవ పడకండి. అది వారి మానసిక ఆరోగ్యాన్ని ఒత్తిడికి గురిచేస్తుంది. వారూ అలానే అరిచే అవకాశం ఉంటుంది. ఇక పిల్లల ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే పెద్దవాళ్ల పట్ల గౌరవం చూపకుండా ఎదురుతిరిగే ప్రమాదం ఉంది.
News January 10, 2025
ఇందిరా గాంధీ చాలా బలహీనమైన వ్యక్తి: కంగన
మాజీ PM ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా ‘ఎమర్జెన్సీ’ని కంగనా రనౌత్ తెరకెక్కించారు. ఆ మూవీ ప్రమోషన్ల సందర్భంగా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇందిర చాలా బలహీనమైన వ్యక్తి అని నా పరిశోధనలో అర్థమైంది. ఆమె మీద ఆమెకే నమ్మకం లేదు. అందుకే పరిస్థితులపై మరింత నియంత్రణను కోరుకున్నారు. తన మనుగడకు చాలామందిపై ఆధారపడ్డారు. అయితే ఈ సినిమా ద్వారా ఎవరి మనోభావాల్ని దెబ్బతీయాలన్న ఉద్దేశమూ నాకు లేదు’ అని పేర్కొన్నారు.