News March 21, 2025
కాసేపట్లో చెన్నైకి సీఎం రేవంత్ ప్రయాణం

TG: CM రేవంత్ కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నైకి ప్రయాణం కానున్నారు. డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు CM స్టాలిన్ అధ్యక్షతన రేపు అక్కడ జరిగే బీజేపీయేతర దక్షిణాది నేతల భేటీలో ఆయన పాల్గొననున్నారు. ఇదే సభకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా హాజరుకానున్న నేపథ్యంలో అక్కడ ఇద్దరు నేతలూ ఒకే స్టాండ్ తీసుకుంటారా లేక విభేదిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
Similar News
News January 22, 2026
బెండ, టమాటా, వంగ పంటల్లో తెగుళ్ల నివారణ

ఈ సీజన్లో కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టేందుకు రసం పీల్చే పురుగులను నివారించాలి. ఇందుకోసం ఫాసలోన్ లేదా ఫిప్రోనిల్ మందులను లీటరు నీటికి 2ML చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్ల దోమ నివారణకు 1.5గ్రా. ఎసిఫేట్‌ను లీటరు నీటికి కలిపి, కాయతొలుచు పురుగు నివారణకు 2ML ప్రొఫెనోఫాస్ లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. అలాగే అధికారుల సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వేసుకుని నీరు పెట్టుకోవాలి.
News January 22, 2026
ఎండిన వారికి ఇనుము తిండి

తీవ్రమైన ఆకలితో శరీరం బలహీనంగా, ఎండిపోయి ఉన్న వ్యక్తికి ఇనుము ముక్కలను ఆహారంగా ఇస్తే ఎలా ఉంటుంది? ఇనుము తినడానికి పనికిరాదు, అది వారికి బలం ఇవ్వదు సరికదా, ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దానికి ఉపశమనం కలిగించే పరిష్కారాన్ని సూచించాలి, అంతే తప్ప ఆ పరిస్థితిని మరింత దిగజార్చే పరిష్కారాన్ని సూచించకూడదని తెలిపే సందర్భంలో ఈ సామెత వాడతారు.
News January 22, 2026
కొద్దిమంది చేతుల్లోకే సంపద.. బిల్ గేట్స్ హెచ్చరిక

AI కారణంగా వైట్ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడతాయని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ పేర్కొన్నారు. ‘ఐదేళ్లలో వైట్, బ్లూ కాలర్ జాబ్స్ని AI ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వాలు కొత్త స్కిల్స్ నేర్పించడం/టాక్స్ స్లాబ్స్‌లో మార్పులు చేయాలి. AI ఇప్పటికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కాల్ సెంటర్స్‌లో లోయర్ స్కిల్ జాబ్స్ భర్తీ చేసింది. ఇలాగే సాగితే సంపద, అవకాశాలు కొద్దిమంది చేతుల్లోకే వెళ్లిపోతాయి’ అని హెచ్చరించారు.


