News December 29, 2024

వచ్చే నెల 20న దావోస్‌కు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ వచ్చే నెల 20న దావోస్‌కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ వార్షిక ఆర్థిక సదస్సులో ఆయన, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొంటారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడుల్ని తీసుకురావడమే ఈ పర్యటన లక్ష్యమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు సదస్సులో ప్రత్యేకంగా ‘తెలంగాణ పెవిలియన్’ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి.

Similar News

News December 29, 2024

సీఎం చంద్రబాబు పల్నాడు పర్యటన ఖరారు

image

AP: సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. నర్సరావుపేట నియోజకవర్గంలోని యల్లమంద గ్రామంలో ఈ నెల 31న ఉదయం 11 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. పెన్షన్ల పంపిణీ అనంతరం లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మ.12.40 తర్వాత పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.

News December 29, 2024

ORR లీజులోనూ అవకతవకలు: కోమటిరెడ్డి

image

TG: హైదరాబాద్ ORR లీజుకు ఇవ్వడంపై విచారణ జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. హరీశ్‌రావు కోరడంతోనే దీనిపై SIT విచారణకు ఆదేశించామని, దీనిలోనూ అవకతవకలు బయటపడతాయన్నారు. ఫార్ములా-ఈ కార్ రేసులో దొంగలు దొరికారని పరోక్షంగా KTRపై మండిపడ్డారు. అటు 2017లో ఆగిపోయిన RRR ప్రాజెక్టుపై తమ కృషి వల్లే ముందడుగు పడిందని, ఇందుకు సహకరించిన ప్రధాని మోదీ, గడ్కరీకి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

News December 29, 2024

నితీశ్ రెడ్డికి అరుదైన గౌరవం

image

టీమ్ ఇండియా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ హానర్స్ బోర్డులో ఆయన స్థానం దక్కించుకున్నారు. ఆసీస్‌తో టెస్టులో సెంచరీ చేయడంతో ఈ లిస్టులో నితీశ్ పేరు చేర్చారు. కాగా ఇంతకుముందు ఈ లిస్టులో భారత్ నుంచి మన్కడ్, గవాస్కర్, విశ్వనాథ్, పుజారా, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, అజింక్య రహానే, విరాట్ కోహ్లీ ఉన్నారు. వీరందరూ ఈ మైదానంలో శతకాలు బాదారు.