News April 5, 2025
ఈనెల 15న జపాన్కు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 15న జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 23 వరకు అక్కడే ఉంటారు. వెస్టర్న్ జపనీస్ సిటీ ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో ఆయనతో పాటు, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొననున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన ఉండనుంది.
Similar News
News November 23, 2025
మీకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో ఖాతా ఉందా?

AP: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం కొత్తగా IFSC కోడ్ UBIN0CG7999ను ఏర్పాటుచేసినట్లు తెలిపింది. దీనిద్వారానే NEFT/RTGS/IMPS/UPI సేవలను కొనసాగించుకోవచ్చని తెలిపింది. కాగా ఈ ఏడాది మే 1 నుంచి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, గ్రామీణ వికాస్ బ్యాంక్, సప్తగిరి బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులు విలీనమై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా అవతరించిన విషయం తెలిసిందే.
News November 23, 2025
తల్లి పాలల్లో యురేనియం ఆనవాళ్లు.. కానీ!

ఈ ప్రపంచంలో తల్లి పాలను మించిన పోషకాహారం లేదు. కానీ మారిన వాతావరణ పరిస్థితులతో వాటిలోనూ రసాయనాలు చేరుతున్నాయి. తాజాగా బిహార్ తల్లుల పాలల్లో యురేనియం(5ppb-పార్ట్స్ పర్ బిలియన్) ఆనవాళ్లు గుర్తించినట్లు NDMA సైంటిస్ట్ దినేశ్ వెల్లడించారు. అయితే WHO అనుమతించిన స్థాయికంటే తక్కువగానే ఉన్నాయని, దీనివల్ల ప్రస్తుతానికి ప్రమాదం లేదని చెప్పారు. నీటిలో మాత్రం 6 రెట్లు ఎక్కువగా యురేనియం ఆనవాళ్లు ఉన్నాయన్నారు.
News November 23, 2025
పొల్యూషన్ నుంచి కాపాడే ఫుడ్స్ ఇవే

ప్రస్తుతం వాయుకాలుష్యం పెద్ద సమస్యగా మారింది. లైంగిక పరిపక్వత, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే బెర్రీస్, బ్రోకలీ, పసుపు, ఆకుకూరలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు కలిగిన విభిన్న ఆహారాలను చేర్చుకోవడం వల్ల కాలుష్యం నుంచి మిమ్మల్ని రక్షించుకోగలుగుతారని చెబుతున్నారు.


