News April 13, 2025
16న జపాన్ పర్యటనకు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ఖరారైంది. ఈ నెల 16 నుంచి 22 వరకు సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం జపాన్‌లో పర్యటించనుంది. టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనుంది.
Similar News
News April 15, 2025
ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా శ్రేయస్

ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ ఐసీసీ <<16037939>>ప్లేయర్ ఆఫ్ ది మంత్(మార్చి)<<>> అవార్డుకు ఎంపికయ్యారు. కివీస్‌కు చెందిన రచిన్ రవీంద్ర, జాకోబ్ డఫీ పోటీ పడినప్పటికీ అయ్యర్‌ను పురస్కారం వరించింది. ఉమెన్స్ విభాగంలో ఆసీస్ యంగ్ ప్లేయర్ జార్జియా వాల్ అవార్డు దక్కింది. కివీస్‌తో T20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో ఈమె కీలక పాత్ర పోషించారు.
News April 15, 2025
ఢిల్లీలో ఉంటే 10 ఏళ్ల ఆయువు తగ్గినట్లే: గడ్కరీ

ఢిల్లీలో మూడు రోజులు నివసిస్తే జబ్బు చేయడం ఖాయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాజధానిలో నెలకొన్న ఎయిర్ పొల్యూషన్‌పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఢిల్లీలో నివసించేవారికి 10 ఏళ్ల ఆయువు తగ్గినట్లే. ఢిల్లీతోపాటు ముంబైలో కూడా ఇదే పరిస్థితి. దీనిపై అత్యవసర చర్యలు తీసుకోవాలి. ఇంధనాల వాడకాన్ని భారీగా తగ్గించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
News April 15, 2025
మహిళల ఆర్థిక సాధికారత కోసం కృషి: భట్టి

TG: మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. వారి ఆర్థిక సాధికారత కోసం పనిచేస్తున్నామన్నారు. HYDలో జరుగుతున్న ‘స్త్రీ సమ్మిట్’లో ఆయన ప్రసంగించారు. మహిళలకు ఏడాదికి రూ.21వేల కోట్ల వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగంలోనూ అతివలను భాగస్వామ్యం చేస్తున్నామని పేర్కొన్నారు.