News December 21, 2024

ఈనెల 25న మెదక్ పర్యటనకు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 25న మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. మెదక్ చర్చి వందేళ్ల వేడుకలో పాల్గొననున్నారు. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గా భవాని మాతా ఆలయాన్ని సందర్శిస్తారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.

Similar News

News November 6, 2025

SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న కేరళ

image

EC చేపట్టిన SIRపై TN బాటలోనే కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా SCని ఆశ్రయించనుంది. అఖిలపక్ష సమావేశంలో CM పినరయి విజయన్ దీన్ని వెల్లడించారు. BJP మినహా ఇతర పక్షాలన్నీ దీన్ని ఆమోదించాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ఓటర్ల జాబితా రెడీగా ఉన్నా EC 2002 నాటి జాబితా ప్రకారం SIR నిర్వహించబోవడాన్ని తప్పుబట్టాయి. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయని పేర్కొన్నాయి. EC ఇలా చేయడం వెనుక రహస్యాలున్నట్లేనని ధ్వజమెత్తాయి.

News November 6, 2025

రైతులు ఆ ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి నాదెండ్ల

image

AP: ఈ క్రాప్‌లో నమోదైన ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పెట్టుబడి రాయితీ చెల్లిస్తే.. ఆ సర్వే నంబరులో సాగు చేసిన పంటను కొనుగోలు చేయరంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ఈ నెలలో 11 లక్షలు, DECలో 25 లక్షలు, JANలో 8 లక్షలు, FEBలో 3 లక్షల మె.టన్నులు, మార్చిలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

News November 6, 2025

గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్లు

image

మ్యాప్స్‌లో గూగుల్ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. జెమినీ ఏఐ, వాయిస్ ఇంటరాక్షన్, సేఫ్టీ నోటిఫికేషన్లు, ట్రాఫిక్ అలర్ట్స్, యాక్సిడెంట్లు జోన్ల వార్నింగ్, మెట్రో టికెట్ బుకింగ్స్ సదుపాయాలు తెస్తోంది. వాయిస్ ఇంటరాక్షన్‌తో డ్రైవింగ్‌లో ఉండగానే రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు, ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. రైడర్లు బైక్ ఐకాన్, రంగును మార్చుకోవచ్చు. రోడ్డు గరిష్ఠ వేగం కూడా తెలుసుకునే ఫీచర్ వస్తోంది.