News November 3, 2024

ఈనెల 8న యాదాద్రికి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 8న యాదాద్రి గుట్టకు వెళ్లనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. సీఎం అయ్యాక ఆయన జరుపుకుంటున్న మొదటి జన్మదినం ఇదే. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక నేతలు, అధికారులు ఇవాళ పరిశీలించారు.

Similar News

News December 9, 2025

పేదలు, రైతుల చుట్టే నా ఆలోచనలు: CM రేవంత్

image

తన ఆలోచనలు, TG విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు పేదలు, రైతుల చుట్టే తిరుగుతాయని CM రేవంత్ అన్నారు. ‘నేను ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చా. SC, ST, BC, మైనారిటీలతో కలిసి పెరిగా. వారి సమస్యలు తెలుసు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌తో పాటు కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నాం. చైనా, జపాన్, కొరియా, సింగపూర్ మాకు రోల్ మోడల్స్. అభివృద్ధిలో వాటితో పోటీ పడతాం’ అని డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

News December 9, 2025

సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యం: CM

image

TG: నీతి ఆయోగ్, ISB, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజల సూచనలు, సలహాలతో తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. 83 పేజీలతో తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో విజన్ డాక్యుమెంట్‌ను ఆయన ఆవిష్కరించారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చామన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.

News December 9, 2025

ఇంట్లోని గుమ్మాలు, కిటికీల మాదిరిగానే స్థంభాలు కూడా సరి సంఖ్యలో ఉండాలా?

image

వాస్తు ప్రకారం గుమ్మాలు, కిటికీలతో స్థంభాలు భిన్నమైనవని, వీటి ఉపయోగాలు వేర్వేరని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘గుమ్మాలు, కిటికీలను గాలి, వెలుతురు కోసం చూస్తారు. కాబట్టి వాటి సంఖ్య విషయంలో నియమాలు ఉంటాయి. కానీ స్థంభాలు గోడల్లో కలిసిపోతాయి. పిల్లర్స్, బీమ్స్ అనేవి ఇంటి నిర్మాణంలో భవన పటిష్టతకు సంబంధించినవి. అవి సరి సంఖ్యలో ఉండాలనే నియమాలు లేవు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>