News March 12, 2025
విప్లు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ క్లాస్

TG: అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేస్తుంటే ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు అడ్డుకోకుండా ఏం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటుంటే ఎందుకు స్పందించలేదని సీఎల్పీ మీటింగ్లో వారికి క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వ విప్లు పనితీరు మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో సభ్యుడు ఒక్కో విషయాన్ని పంచుకోవాలని సూచించారు. సభకు సభ్యులందరూ హాజరు కావాలని పేర్కొన్నారు.
Similar News
News September 19, 2025
నేడు YCP ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమం

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ ‘చలో మెడికల్ కాలేజీ’ చేపడుతున్నట్లు YCP ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
News September 19, 2025
CM రేవంత్ ఇవాళ్టి ఢిల్లీ షెడ్యూల్

ఢిల్లీ: CM రేవంత్ ఉ.11గం.కు తాజ్ ప్యాలెస్లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి.మర్ఫీతో సమావేశమవుతారు. ఉ.11:30గం.కు బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే 12వ వార్షిక ఫోరమ్లో ప్రసంగిస్తారు. మ.12గం.కు అమెజాన్, కార్ల్స్ బర్గ్, గోద్రెజ్, ఉబర్ కంపెనీల ప్రతినిధులను పెట్టుబడులపై కలుస్తారు. మ.12:30గం.కు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు, నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్జ్ బ్రెండేతో ప్రత్యేక భేటీ ఉంటుంది.
News September 19, 2025
భారత్-చైనాని ట్రంప్ భయపెట్టలేరు: రష్యా మంత్రి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బెదిరింపులు భారత్-చైనాలను భయపెట్టలేకపోయాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ వ్యాఖ్యానించారు. ‘నాకు నచ్చనిది చేయకండి టారిఫ్స్ విధిస్తాను అన్న ధోరణి ప్రాచీన నాగరికత కలిగిన భారత్, చైనా విషయంలో పనిచేయదు. అమెరికాకు అది అర్థమవుతోంది. సుంకాలు వేస్తే ఆ దేశాలను ఇంధనం, మార్కెట్ వంటి రంగాల్లో ఆల్టర్నేటివ్స్ వైపు మళ్లిస్తాయి’ అని తెలిపారు.