News September 19, 2025
ఫిరాయింపులపై CM రేవంత్ కామెంట్.. చట్టం ఏం చెబుతోంది..?

రాజ్యాంగ సవరణ-52తో 1985లో చేర్చిన పదో షెడ్యూల్‌లో ఫిరాయింపుల గురించి ఉంది. శాసన సభ్యులు ఎన్నికైన పార్టీకి రిజైన్ చేస్తే ఫిరాయించినట్లు. ఓటింగ్‌కు హాజరుకావాలని విప్ జారీ చేస్తే రాకపోయినా, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసినా స్పీకర్/ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసి తొలగింపజేయొచ్చు. గెలిచాక మరో పార్టీలో చేరినా ఫిరాయింపే అని ఉన్నా.. <<17762540>>చేరారు<<>> అనే నిర్ధారణ వివరించలేదు. స్పీకర్ విచక్షణతో నిర్ణయం తీసుకుంటారు.
Similar News
News January 24, 2026
పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,470 పెరిగి రూ.1,58,620కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,350 ఎగబాకి రూ.1,45,400 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.3,60,100 వద్ద కొనసాగుతోంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.
News January 24, 2026
Republic day Special: అరుణా అసఫ్ అలీ

అరుణా అసఫ్ అలీ గొప్ప దేశభక్తురాలు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో జైలు శిక్ష అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించడంతో బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 1942లో అజ్ఞాతంలో ఉంటూనే ఉద్యమాన్ని కొనసాగించారు. 1997లో మరణాంతరం ప్రభుత్వం ఆమెకు ‘భారతరత్న’ ప్రదానం చేసింది.
News January 24, 2026
ఢిల్లీ.. ఊపిరి పీల్చుకో!

దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు ఇవాళ కాస్త స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. వర్షాలు, గాలి వేగం పెరగడంతో వాయు కాలుష్యం తగ్గి గాలి నాణ్యత కొద్దిగా మెరుగైంది. సగటున AQI 249 పాయింట్లుగా నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ క్షీణించడంతో కొన్ని నెలలుగా అక్కడి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలతో పాటు మంచు కురుస్తోంది.


