News December 21, 2024
సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: అల్లు అర్జున్
TG: సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. రోడ్ షో చేశామని చెప్పడం సరికాదని వివరించారు. అనుమతి లేకుండా వెళ్లామనేది తప్పుడు ఆరోపణ అని చెప్పారు. తొక్కిసలాట గురించి మరుసటి రోజు తెలిసిందని వివరించారు. ప్రభుత్వంతో తాను ఎలాంటి వివాదం కోరుకోవట్లేదని చెప్పారు. సినిమా పెద్ద హిట్ అయినా 15 రోజులుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేకపోతున్నానని పేర్కొన్నారు.
Similar News
News December 22, 2024
ఈ ఏడాది అత్యంత లాభాలు చూసిన సినిమా ఏదంటే..
ఈ ఏడాది అత్యధిక శాతం లాభాలు పొందిన తెలుగు సినిమా ఏది? పుష్ప-2 సినిమా ఇప్పటికే రూ.1500 కోట్ల మార్కును దాటేసినా తొలి స్థానంలో ఉన్నది ఆ మూవీ కాదు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి వరల్డ్ వైడ్ రూ.350 కోట్ల వరకూ వసూలు చేసిన హనుమాన్ మూవీ అగ్రస్థానంలో ఉంది. ఆ సినిమాకు 650 శాతం నుంచి 775 శాతం మేర లాభాలు వచ్చినట్లు అంచనా.
News December 22, 2024
తీవ్ర వరదలు.. కటిక కరవు
గ్లోబల్ వార్మింగ్ కారణంగా రానున్న సంవత్సరాల్లో కొన్ని రాష్ట్రాలు తీవ్ర వరద, మరికొన్ని తీవ్రమైన కరవును ఎదుర్కోనున్నాయి. ఐఐటీ గువాహటి, ఐఐటీ మండీ, CSTEP అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 51 జిల్లాలు అత్యధిక వరదలు, 91 జిల్లాలు తీవ్ర కరవు కేటగిరీలో ఉన్నాయంది. ఏపీలోని కృష్ణా, ప.గోదావరి, గుంటూరు జిల్లాలకు వరద ముప్పు, విశాఖ, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు కరవు సమస్య పొంచిఉన్నట్లు తేలింది.
News December 22, 2024
ప్రశ్నార్థకంగా MVA మనుగడ!
మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ మనుగడ ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల వల్ల సొంత బలం కోల్పోయామన్న భావనలో 3 పార్టీలున్నాయి. ముఖ్యంగా శివసేన UBT ముంబై నగరంలో తన ప్రాభవాన్ని కోల్పోయింది. దీంతో పునర్వైభవం కోసం కూటమికి దూరం జరుగుతోంది. 2025లో జరగనున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.