News December 24, 2024

సీఎం రేవంత్ దావోస్ పర్యటన

image

TG: సీఎం రేవంత్ రెడ్డి జనవరి 20 నుంచి 24 వరకు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అక్కడ జరిగే ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ టూర్‌కు వెళ్తారు.

Similar News

News December 25, 2024

టెన్త్ విద్యార్థులకు మరో అవకాశం

image

AP: పదో తరగతి విద్యార్థులకు SSC పరీక్షల విభాగం మరో అవకాశం కల్పించింది. వివిధ కారణాలతో మార్చి-2025 పరీక్ష ఫీజు చెల్లించని వారికోసం తత్కాల్ విధానం తీసుకొచ్చింది. ఈ నెల 27 నుంచి జనవరి 10 వరకు ఫీజులు చెల్లించవచ్చని తెలిపింది. తత్కాల్‌లో రూ.1000 ఫైన్‌ చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కె.శ్రీనివాసులురెడ్డి సూచించారు.

News December 25, 2024

ఫిర్యాదు చేస్తే పట్టించుకోవట్లేదు.. హైకోర్టులో అంబటి పిటిషన్

image

AP: వైఎస్ జగన్‌తో పాటు తన కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలువురు తనకు ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ పిటిషన్ రేపు/ఎల్లుండి విచారణకు రానుంది. పార్టీ ఇన్‌పర్సన్‌గా రాంబాబు స్వయంగా వాదనలు వినిపించనున్నారు.

News December 25, 2024

కారు అమ్మితే 18% జీఎస్టీ.. వీరికి మాత్రమే

image

సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలపై 18% జీఎస్టీ విధించడంతో నెటిజన్లు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ క్లారిటీ ఇచ్చింది. ఇది కేవలం రిజిస్టర్డ్ బిజినెస్ (డీలర్ల)కే వర్తిస్తుందని పేర్కొంది. వ్యక్తిగతంగా కారు అమ్మితే ఎలాంటి జీఎస్టీ ఉండదని తెలిపింది. అయితే డీలర్ చెల్లించిన ఆ పన్ను మొత్తాన్ని తిరిగి కస్టమర్ నుంచే వసూలు చేస్తారని, భారం తమకే అని పలువురు మండిపడుతున్నారు.