News August 21, 2025

సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన రద్దు

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ్టి ఢిల్లీ పర్యటన రద్దైంది. రాష్ట్రంలో పలు అధికారిక కార్యక్రమాల రీత్యా ఈ పర్యటన రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇవాళ OU పర్యటన ఉండగా, దాన్ని క్యాన్సిల్ చేసుకొని ఢిల్లీ వెళ్తారని నిన్న వార్తలొచ్చాయి. హస్తిన పర్యటన రద్దు కావడంతో ఓయూలో పర్యటిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Similar News

News March 20, 2026

ఇరాన్‌తో యుద్ధం కోసం ₹18 లక్షల కోట్లు!

image

ఇరాన్‌తో యుద్ధం కొనసాగించేందుకు $200 బిలియన్లు(₹18 లక్షల కోట్లు) కావాలని US కాంగ్రెస్‌ను పెంటగాన్ కోరినట్లు తెలుస్తోంది. ఇది ఇరాన్ ఎకానమీ($356B)లో సగం కంటే ఎక్కువ కావడం గమనార్హం. యుద్ధం మొదలైన తొలి వారంలోనే US $11B పైగా ఖర్చు చేసింది. ‘$200B అంటే చిన్న మొత్తమే. US ఎకానమీని దెబ్బతీస్తున్న ఇజ్రాయెల్ PM నెతన్యాహుకు అమెరికన్లు థాంక్స్ చెప్పాలి’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఎద్దేవా చేశారు.

News March 20, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 20, 2026

BREAKING: పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష వాయిదా

image

AP: పదో తరగతి ఇంగ్లిష్ (థర్డ్ లాంగ్వేజ్) పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. రంజాన్ పండుగ నేపథ్యంలో ఈ నెల 21న పబ్లిక్ హాలిడే వచ్చింది. దీంతో ఆ రోజు జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9.30 నుంచి 12.45 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని డీఈవోలకు ఆదేశాలిచ్చింది. మరోవైపు ఇంటర్ ఫస్టియర్ IPE పరీక్ష ఈ నెల 21 నుంచి 25వ తేదీకి వాయిదా పడింది.