News August 12, 2024
డ్రైవర్ లెస్ కారులో సీఎం రేవంత్ ప్రయాణం

TG: సీఎం రేవంత్ రెడ్డి డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో వేమో అనే డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించి దాని విశేషాల గురించి ఆయన తెలుసుకున్నారు. సీఎంతోపాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా అందులో ప్రయాణించారు.
Similar News
News October 15, 2025
పాదాలు తెల్లగా అవ్వాలంటే..

చాలామంది ఇతర శరీర భాగాలపై పెట్టిన శ్రద్ధ పాదాలపై పెట్టరు. దీంతో ఇవి దీర్ఘకాలంలో నల్లగా మారిపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు చర్మ నిపుణులు. కాళ్లను క్లీన్ చేశాక తడిలేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్ రాయాలి. బయటకు వెళ్లేటపుడు సన్స్క్రీన్ రాసుకోవాలి. లాక్టిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, విటమిన్ C, హైడ్రోక్వినోన్లున్న లైటెనింగ్ క్రీములు వాడాలని సూచిస్తున్నారు.
News October 15, 2025
దారులు వేరైనప్పుడు KCR ఫొటో పెట్టుకోవడం కరెక్ట్ కాదు: కవిత

TG: కేసీఆర్ ఫొటో లేకుండానే ‘జాగృతి జనం బాట’ చేపట్టనున్నట్లు కవిత ప్రకటించారు. ‘ఆయన కడుపున పుట్టడం జన్మజన్మల అదృష్టం. కానీ దారులు వేరవుతున్నప్పుడు ఇంకా KCR పేరు చెప్పుకోవడం నైతికంగా కరెక్ట్ కాదు. చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. నేను వేరే తొవ్వ వెతుక్కుంటున్నా. గతంలో జాగృతి పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ఫొటో పెట్టకుండా జయశంకర్ ఫొటోనే పెట్టాం’ అని చెప్పారు.
News October 15, 2025
మేడిగడ్డ పునరుద్ధరణకు వడివడిగా అడుగులు

TG: వరదల్లో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు ప్రభుత్వం చురుగ్గా కదులుతోంది. పునరుద్ధరణ ప్లాన్, డిజైన్లకోసం బిడ్ల దాఖలు నేటితో ముగియనుంది. HYD, మద్రాస్, రూర్కీ IITలు టెండర్లు దాఖలు చేశాయి. మరికొన్ని ప్రముఖ సంస్థలు కూడా బిడ్లు వేసేందుకు రెడీగా ఉండడంతో గడువు పొడిగించడంపై ఆలోచిస్తోంది. NDSA సిఫార్సులకు అనుగుణంగా ఉన్న బిడ్ను ఆమోదించి నిర్మాణ పనులకు టెండర్లు పిలవనుంది.