News August 25, 2024
హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్లో చెరువులను చెరబట్టిన వాళ్ల నుంచి వాటికి హైడ్రా ద్వారా విముక్తి కల్పిస్తున్నామని CM రేవంత్ రెడ్డి వెల్లడించారు. HYDలో హరేకృష్ణ ఆధ్వర్యంలో అనంత శేష స్థాపన ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. ‘చెరువులను ఆక్రమించినవారిని వదలం. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గం. అక్రమ నిర్మాణాలు కూలుస్తాం. కబ్జాదారులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండొచ్చు. చెరువుల కోసం వారి భరతం పడతాం’ అని CM స్పష్టం చేశారు.
Similar News
News November 17, 2025
మృతులంతా హైదరాబాదీలే: TG హజ్ కమిటీ

సౌదీ <<18308554>>బస్సు ప్రమాద<<>> మృతులంతా హైదరాబాద్కు చెందిన వారేనని తెలంగాణ హజ్ కమిటీ స్పష్టం చేసింది. ‘4 ఏజెన్సీల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్లారు. మక్కా యాత్ర తర్వాత మదీనాకు బయల్దేరారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న మొత్తం 45మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 17మంది పురుషులు, 28మంది మహిళలున్నారు. చనిపోయినవారు మల్లేపల్లి, బజార్ఘాట్, ఆసిఫ్నగర్ తదితర ప్రాంతాలకు చెందినవారు’ అని వెల్లడించింది.
News November 17, 2025
ఈ మహిళలు ఏడాదికో కొత్త భాగస్వామిని ఎంచుకోవచ్చు!

రాజస్థాన్లోని గరాసియా తెగలో వింత ఆచారం ఉంది. ఇక్కడి మహిళలు జాతరలో తమకు నచ్చిన కొత్త భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంది. సహజీవనం చేశాక గర్భం దాల్చితే పెళ్లి చేసుకోవాలి. నచ్చకపోతే మహిళ విడిపోయి మళ్లీ కొత్త వ్యక్తిని వెతుక్కునే స్వేచ్ఛ ఉంది. ఈ సహజీవనం కోసం అబ్బాయి అమ్మాయికి డబ్బు చెల్లించాలి. ఒకవేళ మహిళ మరొకరితో జీవించాలనుకుంటే ఎంచుకున్న కొత్త వ్యక్తి మాజీ భాగస్వామికి అధిక మొత్తంలో డబ్బు చెల్లించాలి.
News November 17, 2025
బొప్పాయిలో రసం పీల్చే పురుగులను ఎలా నివారించాలి?

బొప్పాయి మొక్కలు నాటడానికి 15 రోజుల ముందే తోట చుట్టూ 2 వరుసల్లో అవిశ, 2 వరుసల్లో మొక్కజొన్న మొక్కలను నాటాలి. అలాగే పొలంలో రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని తెలుసుకోవడానికి ఎకరాకు 12-15 పసుపు రంగు జిగురు అట్టలను మొక్కల కన్నా ఎత్తులో పెట్టాలి. ఒకవేళ రసం పీల్చే పురుగులను గమనిస్తే లీటరు నీటికి వేపనూనె 2.5ml+ అసిఫేట్ 1.5 గ్రా+ జిగురు 0.5ml కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉద్ధృతిని బట్టి పిచికారీ చేయాలి.


