News February 17, 2025

కృష్ణా జలాలపై CM రేవంత్ కీలక ఆదేశాలు

image

TG: శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఏపీ ఎక్కువ నీటిని తరలించుకుపోకుండా చూడాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఏపీ ఏకపక్షంగా వ్యవహరిస్తే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. నీటి సరఫరాలో టెలిమెట్రీ విధానం అమలు చేయాలని పేర్కొన్నారు. టెలిమెట్రీ నిర్వహణకు అవసరమైన నిధులన్నీ తెలంగాణనే భరిస్తుందని చెప్పారు. వెంటనే టెలిమెట్రీ అమలు చేయాలని కేంద్రానికి లేఖ రాయాలని ఆదేశించారు.

Similar News

News November 21, 2025

మాజీ మంత్రి శైలజానాథ్‌కు మాతృవియోగం

image

శింగనమల వైసీపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ తల్లి సాకే గంగమ్మ మృతి చెందారు. అనంతపురంలోని రామకృష్ణ నగర్‌లో నివాసం ఉంటున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మృతితో శైలజానాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు శైలజానాథ్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News November 21, 2025

మరో తుఫాను ‘సెన్‌యార్‌’!

image

రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ‘సెన్‌యార్’ పేరును IMD పెట్టనున్నట్లు సమాచారం. సెన్‌యార్ అంటే ‘లయన్’ అని అర్థం. తుఫాను ప్రభావంతో 24వ తేదీ నుంచి తమిళనాడులో, 26-29వరకు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇటీవల ‘మొంథా’ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.

News November 21, 2025

కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పేపర్ 2 పరీక్ష ఎప్పుడంటే?

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 552 కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు సంబంధించి పేపర్ 2 పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించింది. డిసెంబర్ 14న డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 12న నిర్వహించిన పేపర్ 1 పరీక్షను 6,332 మంది రాయగా.. పేపర్ 2కు 3,642మంది అర్హత సాధించారు.