News May 25, 2024
అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

HYD ORR లోపల ఉన్న ప్రాంతాన్ని యూనిట్‌గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. కేవలం వర్షకాలమే కాకుండా ఏడాదంతా పనిచేసేలా ఈ వ్యవస్థ ఉండాలని సూచించారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి ఉండేలా జూన్ 4లోగా పూర్తి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని.. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Similar News
News November 28, 2025
సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


