News January 10, 2025

కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం

image

TG: కలెక్టర్లతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రైతుభరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. కొత్త పథకాల విధివిధానాల ఖరారుపైనా చర్చిస్తున్నారు.

Similar News

News January 23, 2026

పెరటి కోళ్ల పెంపకం.. స్వర్ణధార కోళ్ల ప్రత్యేకత ఇదే

image

స్వర్ణధార కోళ్లు కూడా పెరటి కోళ్ల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి అధిక శరీర బరువును కలిగి ఉంటాయి. ఏడాదికి 190 వరకు గుడ్లను పెడతాయి. గుడ్లు, మాంసం ఉత్పత్తి కోసం ఎక్కవ మంది పెరటి కోళ్ల పెంపకానికి స్వర్ణధార కోళ్లను ఎంపిక చేసుకుంటారు. ఇవి 22 నుంచి 23 వారాల్లో సుమారు 3 నుంచి 4 కిలోల బరువు పెరుగుతాయి. వీటి గుడ్డు బరువు 50-60 గ్రాములుంటుంది. స్వర్ణధార కోళ్లకు గుడ్లు పొదిగే సామర్థ్యం 80-85%గా ఉంటుంది.

News January 23, 2026

రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

బెంగళూరులోని <>రామన్<<>> రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 3 రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు ఫిబ్రవరి 13వరకు అప్లై చేసుకోవచ్చు. MSc/MTech, BE/BTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.31వేలు+HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.rri.res.in/

News January 23, 2026

వసంత రుతువు రాకను సూచించే పండుగ

image

వసంత పంచమి అంటే వసంత కాలానికి స్వాగతం పలికే రోజు. మాఘ మాసంలో ఐదవ రోజున ఈ పండుగ వస్తుంది. ఇది చలికాలం ముగింపును, ప్రకృతిలో వచ్చే మార్పులను సూచిస్తుంది. ఈ సమయంలో ఆవ చేలు పసుపు రంగు పూలతో కళకళలాడుతుంటాయి. పసుపు రంగు జ్ఞానానికి, శక్తికి, శాంతికి చిహ్నం. అందుకే కొత్త పనులు ప్రారంభించడానికి, పెళ్లిళ్లకు లేదా కొత్త ఇంట్లోకి ప్రవేశించడానికి ఈ రోజును అత్యంత శుభప్రదమైనదిగా భారతీయులు భావిస్తారు.