News April 15, 2025
సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. సీఎల్పీ భేటీ కోసం నోవాటెల్ హోటల్‌కు వెళ్లగా ఆయన ఎక్కిన లిఫ్టులో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్ వెయిట్ కారణంగా లిఫ్ట్ ఆగాల్సిన చోటు కంటే రెండు అడుగులు కిందకి దిగిన లిఫ్ట్. 8 మంది ఎక్కాల్సిన దాంట్లో 13 మంది ఎక్కడంతో సమస్య తలెత్తింది. అప్రమత్తమైన అధికారులు లిఫ్టులో నుంచి రేవంత్‌ను సురక్షితంగా బయటకు తీశారు.
Similar News
News October 31, 2025
బ్యాంకులకు కొత్త డొమైన్.. నేటితో ముగిసిన గడువు

సైబర్ నేరాలను తగ్గించడమే లక్ష్యంగా బ్యాంకులు తమ వెబ్సైట్లను .bank.in డొమైన్‌కు మార్చుతున్నాయి. ఇందుకు RBI విధించిన గడువు నేటితో ముగిసింది. ఇప్పటి వరకు SBI, PNB, CANARA వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు HDFC, ICICI, AXIS, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేటు బ్యాంకులూ కొత్త డొమైన్‌కు మారాయి. మరికొన్ని బ్యాంకులు .comతో కొనసాగుతూ ఏదైనా కేటగిరీ ఎంచుకున్నప్పుడు .bank.inకు రీడైరెక్ట్ చేస్తున్నాయి.
News October 31, 2025
రవితేజ ‘మాస్ జాతర’ రివ్యూ&రేటింగ్

గంజాయి ముఠాను సిన్సియర్ రైల్వే పోలీసు ఎలా అంతం చేశాడనేదే ‘మాస్ జాతర’ స్టోరీ. రవితేజ లుక్, ఎనర్జీ, ఫైట్స్, డైలాగ్స్‌తో అదరగొట్టారు. అక్కడక్కడ కామెడీ సీన్లు నవ్వు తెప్పిస్తాయి. BGM, సాంగ్స్ ఆకట్టుకుంటాయి. రొటీన్ కమర్షియల్ స్టోరీ, కథలో బలం లేకపోవడం, ఔట్‌డేటెడ్ స్క్రీన్ ప్లే నిరాశ పరుస్తాయి. మధ్యమధ్యలో కొన్ని అనవసర సీన్లు చికాకు తెప్పిస్తాయి.
RATING: 2.5/5
News October 31, 2025
2018లోనే జెమీమా ప్రతిభను గుర్తించిన ENG మాజీ కెప్టెన్

మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్లో అద్భుతంగా రాణించిన ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ పేరు మార్మోగుతోంది. అయితే ఈమె స్టార్‌గా ఎదుగుతారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ 2018లో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరలవుతోంది. ‘ఈ పేరు గుర్తుంచుకోండి.. జెమీమా రోడ్రిగ్స్. ఇండియాకు స్టార్‌గా మారుతుంది’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ అంచనా నిజమైందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


