News February 28, 2025

కిషన్ రెడ్డికి CM రేవంత్ బహిరంగ లేఖ

image

TG: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి CM రేవంత్ 9 పేజీల బహిరంగ <>లేఖ<<>> రాశారు. ప్రభుత్వ వినతులను పట్టించుకోవడం లేదని తేదీలతో సహా ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై 2024, నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించినా స్పందన లేదని మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవంపైనా అదే తీరని పేర్కొన్నారు. ఇకనైనా TGకు సంబంధించి రూ.1,63,559.31కోట్ల ప్రాజెక్టుల అనుమతులు, నిధుల మంజూరుకు శ్రద్ధ వహించాలని లేఖలో రేవంత్ కోరారు.

Similar News

News February 28, 2025

అకౌంట్లోకి డబ్బులు.. కీలక ప్రకటన

image

TG: రైతుభరోసా డబ్బుల జమపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. 3 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతన్నలకు నిధుల విడుదల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించాలని పేర్కొన్నారు. రైతులకు అందుతున్న ఆర్థిక సాయం, పథకాల అమలు పురోగతిపై బ్యాంకర్లతో చేసిన సమీక్షలో మంత్రి ఈ మేరకు నిర్ణయాలు ప్రకటించారు.

News February 28, 2025

చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఎక్కడ?: బుగ్గన

image

AP: ప్రజల తీర్పుతో మంచి పాలన చేయకుండా బడ్జెట్‌లోనూ YCPపై విమర్శలు ఎందుకని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. బడ్జెట్‌లో అసలు సూపర్ సిక్స్ అమలుకు కేటాయింపులు లేవని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో ప్రజలు అప్పుల పాలయ్యారని తెలిపారు. సీఎం చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఎక్కడ జరుగుతోందో కూటమి నేతలు చెప్పాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారులో వృద్ధి ఎక్కడని నిలదీశారు.

News February 28, 2025

లిరిసిస్టుకు సారీ చెప్పిన స్టార్ హీరోయిన్

image

కంగనా రనౌత్, జావెద్ అక్తర్ వివాదం సమసింది. వీరిద్దరూ పరస్పరం వేసుకున్న పరువు నష్టం దావా కేసులను వెనక్కి తీసుకున్నారు. ‘ఇన్నేళ్ల తర్వాత ఈ వ్యవహారం ముగిసింది. నాకు కలిగించిన అసౌకర్యానికి ఆమె క్షమాపణ చెప్పారు’ అని అక్తర్ బాంద్రా కోర్టు వద్ద మీడియాకు తెలిపారు. 2016లో Email అంశంపై హృతిక్ రోషన్‌తో కంగనా బహిరంగంగా గొడవపడ్డారు. దీనిపై రోషన్ కుటుంబానికి సారీ చెప్పాలని అక్తర్ కోరడంతో ఈ వివాదం మొదలైంది.

error: Content is protected !!