News October 6, 2024
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందన

తెలంగాణలో పంట రుణమాఫీ పూర్తిగా కాలేదని ప్రధాని మోదీ నిన్న చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు. రూ.2లక్షల లోపు పంట రుణాలన్నీ మాఫీ చేశామన్నారు. 22,22,067 మంది రైతులకు రూ.17,869.22కోట్లు మాఫీ జరిగిందని, అందుకు సంబంధించిన పత్రాలను ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ గ్యారంటీ అంటే గోల్డెన్ గ్యారంటీ’ అని రైతులు విశ్వసించారని రేవంత్ అన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం కేంద్రం నుంచి సహకారం కావాలన్నారు.
Similar News
News March 23, 2026
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కారణాలివే!

తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ స్కిన్ లెస్ రేటు రూ.370-400కు చేరింది. వాతావరణంలో అనూహ్య మార్పుల (ఎండలు+వర్షాలు) వల్ల పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కోడి సగటున 3 కేజీల వరకు పెరిగేదని, ప్రస్తుతం కిలోన్నర మాత్రమే ఉంటోందని పేర్కొంటున్నారు. ఉత్పత్తి పడిపోవడం, వరుస పెళ్లిళ్లు, గ్రామాల్లో ఉత్సవాల కారణంగా డిమాండ్ పెరగడం వల్ల రేటు అధికమైందంటున్నారు.
News March 23, 2026
ఈ నెల 28 వరకు వర్షాలు!

AP: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ వరకు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఇవాళ SKLM, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, GNT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA చెప్పింది. మిగతా జిల్లాల్లోనూ జల్లులు పడతాయని అంచనా వేసింది.
News March 23, 2026
ఘోరం: ఆస్పత్రిపై డ్రోన్ దాడి.. 64 మంది మృతి

సూడాన్‌లో ఆర్మీ, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్(RSF) మధ్య ఆధిపత్య పోరు సామాన్యుల ప్రాణాలను తీస్తోంది. తాజాగా ఈద్ రోజున RSF ఆధీనంలో ఉన్న ఓ నగరంలోని ఆస్పత్రిపై జరిగిన డ్రోన్ దాడిలో 64 మంది మృతి చెందారు. వీరిలో 13 మంది పిల్లలు, ఓ డాక్టర్, ఇద్దరు నర్సులు ఉన్నట్లు WHO వెల్లడించింది. మరో 89 మంది గాయపడినట్లు తెలిపింది. ఈ దాడిని ఆర్మీ చేసినట్లు RSF ఆరోపిస్తుండగా తమకు సంబంధం లేదని సైనికులు ప్రకటించారు.


