News August 30, 2024
CM రేవంత్ సంచలన నిర్ణయం.. ఆ మూవీపై నిషేధం?

కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’కి తెలంగాణలో ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని చిత్రాన్ని నిషేధించేందుకు ప్రయత్నిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి సిక్కులకు హామీ ఇచ్చారు. సినిమాలో తమ వర్గాన్ని ఉగ్రవాదులు, దేశద్రోహులుగా చిత్రీకరించారని 18 మంది సభ్యుల సిక్కు బృందం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
Similar News
News December 5, 2025
ఆదోని జిల్లా డిమాండ్.. టీడీపీ నేతలపై సీఎం అసంతృప్తి

కర్నూలు జిల్లా నేతల తీరుపై CM చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండును ముందుగా తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎన్నికల ముందు ఆదోని జిల్లా డిమాండ్ లేదని తిక్కారెడ్డి వివరించినట్లు సమాచారం. దీనిపై జిల్లా నేతలంతా చర్చించుకుని తన వద్దకు రావాలని సీఎం సూచించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
News December 5, 2025
నటుడు క్యారీ-హిరోయుకి తగావా కన్నుమూత

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా(75) కన్నుమూశారు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జపాన్‌లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్‌లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.
News December 5, 2025
స్క్రబ్ టైఫస్ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

AP: స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే చిగ్గర్ పురుగు మనిషిని కుట్టినచోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. తలనొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపి రోగి క్రమంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.


