News October 30, 2024
పార్టీ నేతలకు CM రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

TG: పార్టీని ఇబ్బంది పెట్టేలా స్టేట్మెంట్స్ ఇస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలకు CM రేవంత్, TPCC చీఫ్ మహేశ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. సమంతపై మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ల విషయంలో మాజీ MLA జగ్గారెడ్డి కామెంట్స్ దుమారం లేపిన విషయం తెలిసిందే.
Similar News
News November 10, 2025
ధర్మేంద్ర హెల్త్‌పై రూమర్స్.. టీమ్ క్లారిటీ

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ <<18162519>>ధర్మేంద్ర<<>> ఇటీవల శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిందని, మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని జాతీయ మీడియా పేర్కొంది. వాటిని నటుడి టీమ్ ఖండించింది. ‘ఆయన కోలుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముంబైలోని ఆస్పత్రికి రొటీన్ చెకప్‌కు వెళ్లగా ఇలాంటి వార్తలు వచ్చాయి’ అని క్లారిటీ ఇచ్చారు.
News November 10, 2025
న్యూస్ రౌండప్

*రేపు HYD ఘట్కేసర్ NFC నగర్లో అందెశ్రీ అంత్యక్రియలు. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
*దేవాలయాల్లో తొక్కిసలాట నివారణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
*శంషాబాద్ విమానాశ్రయంలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్. 2.70 లక్షల ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా పునర్నిర్మాణం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
*లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
News November 10, 2025
జూబ్లీహిల్స్.. వెరీ లేజీ!

జూబ్లీహిల్స్.. పేరుకే లగ్జరీ కానీ ఓటు హక్కు వినియోగించుకోవడంలో వెరీ లేజీ. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా సగం మందే ఓట్లు వేస్తున్నారు. 2023లో 47.58%, 2018లో 47.2% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ రోజు ప్రభుత్వం హాలిడే ప్రకటిస్తున్నా ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ఈ ఉపఎన్నిక కీలకంగా మారడంతో ఈసారైనా పోలింగ్ శాతం పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


