News March 16, 2025

నేడు జనగామ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

image

TG: సీఎం రేవంత్ ఇవాళ జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కోనాయిచలం వద్ద రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, ఘన్‌పూర్‌లో 100 పడకల ఆస్పత్రి, డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Similar News

News November 24, 2025

సింగూరు డ్యామ్ ఎందుకు దెబ్బతిందంటే!

image

నగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం ఇటీవల కాలంలో దెబ్బతింది. అధిక మోతాదులో నీటిని నిల్వ చేయడంతోనే ఈ సమస్య వచ్చింది. ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం 517.8 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలి. అయితే గత ప్రభుత్వం మిషన్ భగీరథ కోసం నిల్వలను పెంచాలని ఆదేశించింది. దీంతో 522 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తూ వస్తున్నారు. ఈ కారణంగా ప్రాజెక్టుపై ఒత్తిడి పెరిగి దెబ్బతింది. అందువల్లే మరమ్మతు చేయనున్నారు.

News November 24, 2025

‘Gambhir Go Back’.. నెటిజన్ల ఫైర్

image

గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక టీమ్ ఇండియా ఆటతీరు దిగజారిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. స్వదేశంలో జరిగే టెస్టుల్లోనూ ఇంత దారుణమైన బ్యాటింగ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయ్యామని, BGT సిరీస్ కోల్పోయామని గుర్తు చేస్తున్నారు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే మార్పులు ఎందుకని మండిపడుతున్నారు. గంభీర్ హెడ్ కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 24, 2025

అరటి పంట పెరుగుదల, పండు నాణ్యత కోసం

image

అరటి మొక్కకు కొద్దిపాటి రసాయన ఎరువులతో పాటు ఎక్కువ మొత్తంలో సేంద్రియ ఎరువులను వేయడం వల్ల మొక్క ఎదుగుదలతో పాటు పండు నాణ్యత పెరుగుతుంది. 300 గ్రాముల భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 5 కేజీల బాగా చిలికిన పశువుల ఎరువుతో కలిపి మొక్కలకు అందించాలి. 45 సెం.మీ పొడవు, వెడల్పు, లోతుతో గుంతలు తీసి అందులో ఈ ఎరువును వెయ్యాలి. భాస్వరం ఎరువులు పంట మొదటి దశలోనే అవసరం. తర్వాతి దశలో అవసరం ఉండదు.