News December 25, 2024
నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
TG: CM రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఆయన తొలుత ఏడుపాయల వనదుర్గమాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆపై అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం మెదక్ CSI చర్చి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారని చెప్పాయి. అటు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కూడా నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు.
Similar News
News December 25, 2024
అరవింద్ కేజ్రీవాల్‌ది గోలా? సెల్ఫ్ గోలా?
ఢిల్లీ CM ఆతిశీని అక్రమ కేసులో అరెస్టు చేస్తారన్న కేజ్రీవాల్ మాటలపై చర్చ జరుగుతోంది. మహిళలకు నగదు బదిలీ, సంజీవనీ స్కీములేమీ లేవంటూ HFW శాఖ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. దీన్నుంచి డైవర్ట్ చేయడమే ఆయన ప్లానని కొందరు అంటున్నారు. ఆప్‌లో ఆయన్ను మించి ఎవర్నీ ఎదగనివ్వరని, క్రమంగా ఆతిశీని సైడ్‌లైన్ చేస్తున్నారని మరికొందరి అంచనా. పార్టీ ఫౌండింగ్ మెంబర్స్‌ను తరిమేయడాన్ని ఉదహరిస్తున్నారు. దీనిపై మీరేమంటారు?
News December 25, 2024
భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాలో తేలిక నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అటు ప్రధాన ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
News December 25, 2024
ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకునే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి పనులపై చర్చిస్తారని సమాచారం. కాగా ఇంతకుముందే కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్‌తో చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే.