News October 4, 2024
నూతన స్పోర్ట్స్ పాలసీపై సీఎం సమీక్ష

TG: 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త స్పోర్ట్స్ పాలసీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలన్నారు. హైదరాబాద్‌లోని స్టేడియాలను ఒక హబ్‌గా చేయడంతో పాటు స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
Similar News
News April 1, 2026
టీ తోటలో మోదీ.. కార్మికులతో ముచ్చట్లు

అస్సాం పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దిబ్రూగఢ్‌లోని టీ తోటలను సందర్శించారు. అక్కడ తేయాకు కోస్తున్న మహిళా కార్మికులతో ముచ్చటించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న మోదీ.. అస్సాం టీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంలో వారి శ్రమ అమూల్యమైనదని కొనియాడారు. తోటల్లో మహిళలతో కలిసి సరదాగా కాసేపు తేయాకు కోశారు. ఈ ఫొటోలను Xలో షేర్ చేశారు.
News April 1, 2026
IPL: శ్రేయస్ అయ్యర్‌కు ఫైన్

IPL-19 సీజన్‌లో తొలిసారి PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు BCCI ఫైన్ విధించింది. నిన్న GTతో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ ల రూ.12లక్షల ఫైన్ వేసింది. PBKS 19వ ఓవర్ చేరుకునేటప్పటికే అంపైర్ స్లో ఓవర్ వార్నింగ్ ఇవ్వగా ఆపై <<19529168>>అర్ష్‌దీప్<<>> మరింత ఆలస్యం చేశారు.
News April 1, 2026
అమరావతి బిల్లుపై చర్చకు YCP

పార్లమెంటులో ఇవాళ ప్రవేశపెట్టే రాజధాని అమరావతి బిల్లుపై చర్చలో వైసీపీ పాల్గొననుంది. ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను టీడీపీ ఎంపీలు కలిశారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చర్చకు ఉంటుందని ఎంపీలతో స్పీకర్ చెప్పారు.


