News April 9, 2024
రాజీవ్ రతన్ మరణం పట్ల సీఎం దిగ్భ్రాంతి

తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్ట సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Similar News
News February 21, 2026
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News February 21, 2026
అభిషేక్ ఫామ్‌పై కెప్టెన్ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

T20WCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ అభిషేక్ డకౌట్ కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కెప్టెన్ సూర్య స్పందించారు. అభి గురించి ఆందోళన పడుతున్నవారి గురించి తాను ఆందోళన పడుతున్నట్లు చమత్కరించారు. అతడిని ఎదుర్కోబోతున్న ప్రత్యర్థి జట్లపై మరింత ఆందోళనగా ఉందన్నారు. అభి బ్యాట్‌తో ఏం చేస్తాడో గతేడాది చూశామని, ప్రస్తుతం మద్దతుగా నిలవాల్సిన టైమ్ అని చెప్పారు. దీంతో రేపటి మ్యాచ్‌లో అభిషేక్ ఆడటం కన్ఫర్మ్ అయినట్లే.
News February 21, 2026
మహిళలకు నెలకు రూ.25,000.. క్లారిటీ

కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్‌ను తీసుకొచ్చిందంటూ SMలో జరుగుతున్న ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇంటి దగ్గరే పనిచేస్తే రూ.25వేలు జీతం వస్తుందనేది అవాస్తవమని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను చూసి మోసపోవద్దని పౌరులకు సూచించింది. ఫేక్ న్యూస్, వీడియో, ఫొటో కనిపిస్తే factcheck@pib.gov.inకు పంపాలని కోరింది.


