News April 3, 2024
రియాక్టర్ పేలుడు ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

TG: సంగారెడ్డి జిల్లాలో SB కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు <<12982731>>ఘటనపై<<>> సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలానికి వెళ్లి సహాయ చర్యలు పర్యవేక్షించాలని ఫైర్ డీజీ నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి సూచించారు. మంత్రులు దామోదర, కొండా సురేఖ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.
Similar News
News January 3, 2026
కేసీఆర్, జగన్ ఏపీకి మేలు చేయాలని చూశారు: ఉత్తమ్

TG: గతంలో కేసీఆర్, జగన్ చర్చించుకొని ఏపీకి మేలు చేయాలని చూశారని మంత్రి ఉత్తమ్ కుమార్ అసెంబ్లీలో PPT సందర్భంగా ఆరోపించారు. ‘గోదావరి జలాలను రాయలసీమకు తీసుకెళ్తామని కేసీఆర్ అన్నారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని చెప్పింది ఆయనే. ఏపీ-తెలంగాణ వేర్వేరు కాదన్నారు. 2015లో కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల వాటాకు అంగీకరించిందే కేసీఆర్ అని’ పునరుద్ఘాటించారు.
News January 3, 2026
ఉల్లి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

AP: ప్రకృతి వైపరీత్యాలు, ధరల పతనంతో నష్టపోయిన ఉల్లి రైతులకు ప్రభుత్వం చేయూతనందించింది. ఖరీఫ్లో పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో హెక్టార్కు రూ.20 వేల చొప్పున నగదును మంత్రి అచ్చెన్నాయుడు జమ చేశారు. కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతుల అకౌంట్లలో రూ.128.33 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. కర్నూల్ జిల్లాల్లోనే 31,352 మంది ఖాతాల్లో రూ.99.92కోట్లు జమైనట్లు ప్రభుత్వం పేర్కొంది.
News January 3, 2026
అనర్హులకు రైతు భరోసా కట్!

TG: అసలైన అన్నదాతలకే రైతు <<18745358>>భరోసా<<>> దక్కాలని ప్రభుత్వం నిర్ణయించింది. BRS హయాం నుంచి కొండలు, కమర్షియల్ ప్లాట్లు ఉన్నవారికీ సాయం అందుతోందని తేల్చింది. వారికి చెక్ పెట్టేలా శాటిలైట్ మ్యాపింగ్ చేపట్టింది. సింథటిక్ ఎపర్చర్ రాడార్ ఏజెన్సీ సాయంతో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి అనర్హులను గుర్తిస్తున్నారు. కాగా సంక్రాంతికి రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేయనుండగా 65లక్షల మంది అర్హులున్నట్లు తెలిపింది.


