News September 19, 2025

సమస్యల పరిష్కారంపై CM దృష్టి పెట్టాలి: రాజగోపాల్‌రెడ్డి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ MLA రాజగోపాల్‌రెడ్డి సూచించారు. ‘స్థానిక సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలి. మెజారిటీ MLAల అభిప్రాయం కూడా ఇదేనని భావిస్తున్నాను. సంక్షేమ పథకాలతో పాటు సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనన్న వాస్తవాన్ని CM గుర్తించి వ్యవహరించాలి’ అని ట్వీట్ చేశారు. కాగా దీన్ని BRS నేత హరీశ్‌రావు రీట్వీట్ చేయడం గమనార్హం.

Similar News

News January 14, 2026

పీఎఫ్ పెన్షనర్లకు ఇంటివద్దే లైఫ్ సర్టిఫికెట్

image

EPFO పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఇకపై డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కోసం బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సహకారంతో ఈ సేవను ఉచితంగా ఇంటి వద్దే అందుబాటులోకి తెచ్చింది. పోస్ట్‌మ్యాన్ ఇంటి వద్దకే వచ్చి ఆధార్, ఇతర వివరాలు పరిశీలించి బయోమెట్రిక్ ద్వారా సర్టిఫికెట్ అప్‌లోడ్ చేస్తారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇది పెద్ద ఉపశమనం.

News January 14, 2026

సంక్రాంతి సందడి.. పందెం కోళ్లు రె’ఢీ’

image

AP: సంక్రాంతి పండుగ వేళ కోడిపందేల సందడి మొదలు కానుంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, ఉబయ గోదావరి జిల్లాల్లో భారీ స్థాయిలో బరుల ఏర్పాట్లు చేశారు. మారుమూల ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల్లో పందేలకు ఏర్పాట్లు చేస్తుండగా, వారిని కట్టడి చేసేందుకు పోలీసులు డ్రోన్లతో నిఘా పెంచారు. అయినా నిర్వాహకులు ఎక్కడా తగ్గడం లేదు. కోట్ల రూపాయల పందేలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలలో ఉండే హోటళ్లు హౌస్‌ఫుల్ అయ్యాయి.

News January 14, 2026

సంక్రాంతి ముగ్గులు.. 4 వైపులా గీతలు గీస్తున్నారా?

image

ముగ్గును ఎప్పుడూ ఇంటి గడప, వాకిలి ముందే వేయాలి. ముగ్గు వేసిన తర్వాత నాలుగు వైపులా అడ్డగీతలు గాలి. ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవని, లక్ష్మీదేవి ఇంటిని విడిచి వెళ్లదని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఆ గీతలు అక్కడ శుభకార్యాలు జరుగుతున్నాయనే మంగళకరమైన సంకేతాన్ని ఇస్తాయి. ఈ నియమాలు పాటిస్తూ ముగ్గులు వేస్తే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది.