News June 27, 2024

డీకేను సీఎం చేయాలి.. సిద్ధరామయ్య ముందే మఠాధిపతి వ్యాఖ్య

image

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకుని డీకే శివకుమార్‌కు అప్పగించాలని వ‌క్క‌లిగ వర్గానికి చెందిన మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ స్వామి చెప్పారు. బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపెగౌడ 515వ జయంతి ఉత్సవాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య సమక్షంలోనే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. డీకే కూడా వక్కలిగ వర్గమే. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Similar News

News December 29, 2025

NHIDCLలో 48 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (<>NHIDCL<<>>)లో 48 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, Sr జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ టెస్ట్, రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com/

News December 29, 2025

గిల్ చాలా బద్ధకస్తుడు.. కోహ్లీలా ఆడలేడు: పనేసర్

image

టీమ్‌ఇండియా వన్డే & టెస్ట్ కెప్టెన్ గిల్‌ చాలా బద్ధకస్తుడని, కోహ్లీలా దూకుడుగా ఆడలేడని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ విమర్శించారు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేయడం అతనికి భారమని అన్నారు. టెస్టుల్లో నిలదొక్కుకోవాలంటే దేశవాళీ క్రికెట్ బలోపేతం కావాలని సూచించారు. ప్లేయర్లు కేవలం IPL కాంట్రాక్టుల కోసమే ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కోహ్లీ లేకపోవడంతో జట్టులో ఆ తీవ్రత కనిపించడం లేదన్నారు.

News December 29, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.710 తగ్గి రూ.1,41,710కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.650 తగ్గి రూ.1,29,900 పలుకుతోంది. అటు కొద్ది రోజులుగా విపరీతంగా పెరిగిన వెండి ధరలు ఇవాళ దిగివచ్చాయి. కేజీ వెండి ధర రూ.4,000 తగ్గి రూ.2,81,000 పలుకుతోంది.