News March 16, 2025
భద్రత పెంపుపై సీఎం ఆలోచించాలి: డీకే అరుణ

TG: తన ఇంట్లోకి <<15780375>>ఆగంతకుడు<<>> ఎందుకు ప్రవేశించాడో తెలియలేదని ఎంపీ డీకే అరుణ చెప్పారు. హాల్, కిచెన్, బెడ్ రూమ్‌లో సెర్చ్ చేశాడని, ఎలాంటి వస్తువులు దొంగిలించలేదని వెల్లడించారు. తన భర్తకు ఇప్పటివరకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వలేదన్నారు. గతంలో తన నాన్నపై దాడి జరిగిందని, భద్రత పెంపుపై సీఎం రేవంత్ ఆలోచించాలని కోరారు. ఈ ఘటనతో తన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
Similar News
News November 6, 2025
స్టైలింగ్ ఇలా మార్చుకోండి

చాలామంది అమ్మాయిలు ఎన్ని దుస్తులున్నా వేసుకోవడానికి ఏవీ లేవని ఫీల్ అవుతుంటారు. మీ స్టైలింగ్ కాస్త మారిస్తే మీ వార్డ్రోబ్ కొత్తగా కనిపిస్తుందంటున్నారు నిపుణులు. ఉన్నవాటినే రంగులూ, డిజైన్లవారీగా విభజించి మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు. ట్రెండీ దుస్తులు కాకుండా మీ ఒంటి తీరుకు ఏవి నప్పుతాయో చూసుకొని మీకంటూ ఓ స్టైల్ స్టేట్మెంట్ క్రియేట్ చేసుకోండి. అప్పుడే మీరేం వేసినా ఇతరులకంటే భిన్నంగా కనిపిస్తారు.
News November 6, 2025
బీస్ట్ మోడ్‌లోకి ఎన్టీఆర్.. లుక్‌పై నీల్ ఫోకస్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బీస్ట్ మోడ్‌లోకి మారనున్నారు. ‘NTR-NEEL’ మూవీ కోసం ఆయన లుక్ పూర్తిగా మారబోతుందని మేకర్స్ ట్వీట్ చేశారు. త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. తన సినిమాలో ఎన్టీఆర్ హెయిర్ స్టైల్, బియర్డ్ ఎలా ఉండాలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దగ్గరుండి హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌తో సెట్ చేయించారు. తారక్ లుక్ విషయంలో కాంప్రమైజ్ కావొద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.
News November 6, 2025
226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేసుకున్నారా?

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(<


