News December 25, 2024

కన్నడ సూపర్‌స్టార్‌కు సీఎం సిద్దరామయ్య పరామర్శ

image

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్‌ను కర్ణాటక CM సిద్దరామయ్య ఫోన్లో పరామర్శించారు. క్యాన్సర్ సర్జరీ కోసం అమెరికాలో ఉన్న శివ కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ‘శివరాజ్ ఆత్మవిశ్వాసం, ధైర్యం ఆయన్ను ఈ పోరాటంలో గెలిపిస్తాయని నా నమ్మకం. ఈ కష్టాన్ని అధిగమించి ఆరోగ్యంగా తిరిగి వస్తారని ఎదురుచూసే శ్రేయోభిలాషుల్లో నేనూ ఒకడిని. పెద్దల ఆశీస్సులు, యువతరం ప్రార్థనలు ఆయన్ను కాపడతాయి’ అని పేర్కొన్నారు.

Similar News

News November 25, 2025

T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్

image

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌-2026ను ICC రిలీజ్ చేసింది. తొలి మ్యాచ్ FEB 7న పాక్-నెదర్లాండ్స్ మధ్య కొలంబో వేదికగా జరగనుంది. అదే రోజు టీమ్ ఇండియా ముంబై వేదికగా USAతో తలపడనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. IND, PAK, USA, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. మార్చి 8న ఫైనల్ జరగనుంది.

News November 25, 2025

అది సీక్రెట్ డీల్: డీకే శివకుమార్

image

సీఎం మార్పు వ్యవహారం గురించి బహిరంగంగా మాట్లాడాలని అనుకోవడం లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. పార్టీలోని నలుగురు-ఐదుగురు మధ్య జరిగిన రహస్య ఒప్పందమని చెప్పారు. తనను సీఎంను చేయాలని హైకమాండ్‌ను అడగలేదని పేర్కొన్నారు. పార్టీకి ఇబ్బంది కలిగించాలని, బలహీనపరచాలని తాను అనుకోనని తెలిపారు. పార్టీ, కార్యకర్తల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని ఆయన అన్నారు.