News July 26, 2024
సీఎం గారూ.. రైతుల్ని ఆదుకోండి: షర్మిల

AP: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రైతాంగాన్ని ఆదుకోవాలని APCC చీఫ్ YS షర్మిల సీఎంను కోరారు. ముఖ్యంగా కోస్తా జిల్లాల వారు తీవ్రంగా ప్రభావితమయ్యారని గుర్తుచేస్తూ ఆయనకు లేఖ రాశారు. ‘కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం వల్లే పంటపొలాలు నీట మునిగి నష్టం వాటిల్లింది. రైతన్నల దుస్థితిపై MLAలు, MPలు మాట్లాడకపోవడం శోచనీయం. రైతన్నకు వచ్చిన ఈ కష్టాన్ని రాష్ట్ర ఎమర్జెన్సీగా ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.
News November 20, 2025
TMC-HBCHలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <


