News April 15, 2025

వచ్చే నెలలో జనంలోకి సీఎం

image

TG: మే నెలలో జనంలోకి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచించారు. త్వరలోనే ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్లు ఇస్తానన్నారు. రెండో సారి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పథకాలతో మోదీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారానికి దిగాయన్నారు.

Similar News

News December 7, 2025

హాజీపూర్: ఉద్యోగం వదిలి.. సర్పంచ్ బరిలో

image

హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామానికి చెందిన మనుబోతుల అలేఖ్య సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. హైదరాబాద్‌లోని HDFC బ్యాంక్‌లో సేల్స్ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా మంచి ఉద్యోగాన్ని చేస్తున్న ఆమె, గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే పట్టుదలతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. ప్రస్తుతం గిరిజన గ్రామమైన ర్యాలీ గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ఆమె నిర్ణయం గ్రామంలోని యువతకు ఆదర్శంగా నిలిచింది.

News December 7, 2025

ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతాం: ఇండిగో

image

ఇండిగో విమానాల సంక్షోభం ఆరో రోజూ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టుల్లో పదుల సంఖ్యలో సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 100 దాకా రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు. అయితే ఆదివారం కావడంతో రద్దీ కాస్త తగ్గినట్లు సమాచారం. మరోవైపు 95 శాతం కనెక్టివిటీని పునరుద్ధరించామని ఇండిగో చెబుతోంది. ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతామని తెలిపింది.

News December 7, 2025

రబీ నువ్వుల సాగుకు అనువైన రకాలు

image

☛ ఎలమంచిలి 11(TNN వరాహ): పంట కాలం 80-85 రోజులు. నూనె 52%గా ఉంటుంది. దిగుబడి ఎకరాకు 300-350 కిలోలు. ఇది ముదురు గోధుమ రంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు ఈ రకం అనుకూలం.
☛ ఎలమంచిలి 17: పంటకాలం 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 340-400 కిలోలు. గింజల్లో నూనె 52.5%గా ఉంటుంది. ఇది లేత గోధుమ రంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు అనుకూలం. ఆకుమచ్చ తెగులను కొంత వరకు తట్టుకుంటుంది.