News December 13, 2024
రేపు సంక్షేమ హాస్టళ్లలో సీఎం తనిఖీలు

TG: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల పరిస్థితిని అంచనా వేసేందుకు CM రేవంత్, మంత్రులు, అధికారులు రేపు గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను సందర్శించనున్నారు. RR, VKB, HYD జిల్లాల్లో ఏదో ఒక సంక్షేమ హాస్టల్లో CM ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారని పేర్కొన్నారు. కాగా సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ప్రభుత్వం ఇటీవల డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచింది.
Similar News
News November 25, 2025
5న తిరుమల దర్శనం టికెట్ల విడుదల

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి TTD కీలక ప్రకటన వెలువరించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15000 చొప్పున రూ.300 టికెట్లు ఇస్తామని తెలిపింది. డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. ఆరోజు టీటీడీ వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించింది.
News November 25, 2025
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని, రాబోయే 24 గంటల్లో ఇది బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మరోవైపు మలక్కా జలసంధి వద్ద కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని పేర్కొంది. వీటి ప్రభావంతో NOV 29 నుంచి DEC 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
News November 25, 2025
ఆంధ్ర అరటికి.. ఆజాద్పుర్ మండీ వ్యాపారుల హామీ

AP: అరటి ధర పతనంతో కొందరు రైతులు పండిన పంటను చెట్లకే వదిలేశారు. మరి కొందరు పశువులకు మేతగా వేశారు. ఈ తరుణంలో AP నుంచి నాణ్యమైన అరటిని కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీలోని ఆజాద్పుర్ మండీ పండ్ల వ్యాపారులు హామీ ఇచ్చారు. AP అధికారులు నిన్న ఢిల్లీలో ‘బయ్యర్ సెల్లర్స్ మీట్’ నిర్వహించి అక్కడి వ్యాపారులతో చర్చించగా.. 10-15 రోజుల్లో AP నుంచి అరటిని కొంటామని ఆజాద్పుర్ మండీ వ్యాపారులు హామీ ఇచ్చారు.


