News November 11, 2024

113 మంది AMVIలకు నియామకపత్రాలు ఇవ్వనున్న CM

image

TG: రవాణాశాఖలో కొత్తగా 113 మందికి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లుగా నియామకపత్రాలను సీఎం రేవంత్ ఈరోజు అందించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొంటారు. కాగా AMVIలకు ఫీల్డ్ లెవల్‌లో విధులు అప్పగించాలని, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 13, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,10,000కి చేరింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.270 తగ్గి రూ.1,33,910గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 తగ్గి రూ.1,22,750కి చేరింది.

News December 13, 2025

జుట్టుకు బలాన్నిచ్చే విటమిన్లివే..!

image

ప్రస్తుతకాలంలో కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల చాలామంది హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో ఈ విటమిన్లుండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. విటమిన్ బి7, విటమిన్ డి, ఐరన్, జింక్, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఏ ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో పాటు జీవనశైలి మార్పులు, వ్యాయామం, తగినంత నీరు తాగడం వంటివి చేస్తే పట్టులాంటి జుట్టు సొంతమవుతుందంటున్నారు.

News December 13, 2025

పసుపులో ఆకుమచ్చ తెగులు – నివారణ

image

ఆకుమచ్చ తెగులు సోకిన పసుపు ఆకులపై చిన్నచిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి గోధుమ మచ్చలుగా మారతాయి. తెగులు తీవ్రమైతే ఆకు మాడిపోతుంది. దుంపలు, కొమ్ములు, మొక్కల ఎదుగుదల లోపించి దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. ఈ తెగులు కట్టడికి లీటరు నీటికి మాంకోజెట్ 2.5 గ్రాములు లేదా కార్బండిజమ్ 1 గ్రాము లేదా ప్రోపికోనజోల్ 1mlను 0.5ml జిగురుతో కలిపి 15 రోజల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.