News March 10, 2025
రేపు అమరావతి పనులకు సీఎం శంకుస్థాపన

AP: రాజధాని అమరావతిలో నిర్మాణాల పున:ప్రారంభానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎం చంద్రబాబు రేపు రాజధాని పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12 నుంచి పలు ప్రైవేట్ సంస్థలు తమ నిర్మాణాలను విస్తరించనున్నాయి. ఎస్ఆర్ఎంలో రూ.700 కోట్లతో కొత్త విభాగాల నిర్మాణం, విట్‌లో వసతి గృహాలు, అకడమిక్ భవనాల ఏర్పాటుతో పాటు 4 కొత్త భవనాలు నిర్మించేందుకు అమృత్ వర్సిటీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
Similar News
News March 10, 2025
శ్రీదేవి చివరి సినిమాకు సీక్వెల్.. హీరోయిన్ ఎవరంటే?

శ్రీదేవి నటించిన చివరి సినిమా ‘MOM’కు సీక్వెల్ తీయబోతున్నట్లు ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు. ఇందులో తమ రెండో కూతురు ఖుషీ కపూర్ ప్రధాన పాత్రలో కనిపిస్తారని పేర్కొన్నారు. ‘ఖుషీ తన తల్లి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిస్తోంది. నటించిన అన్ని భాషల్లో శ్రీదేవి టాప్ హీరోయిన్గా ఎదిగారు. జాన్వీ, ఖుషీ కపూర్ కూడా ఆ స్థాయిలో సక్సెస్ అవుతారని నమ్ముతున్నా’ అని ఓ ఈవెంట్లో పేర్కొన్నారు.
News March 10, 2025
జడేజా భార్యపై ప్రశంసలు!

న్యూజిలాండ్‌ను టీమ్ఇండియా ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అనంతరం జట్టుతో కుటుంబసభ్యులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన భార్య రివాబా జడేజా, కూతురుతో కలిసి ట్రోఫీతో ఫొటోలు దిగారు. అయితే, విదేశాల్లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌కూ సంప్రదాయబద్ధంగా చీరలో వచ్చి రివాబా అందరి దృష్టినీ ఆకర్షించారు. నెట్టింట ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News March 10, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. వ్యూస్‌లో రికార్డు

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ (INDvsNZ) జియో హాట్‌స్టార్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన మ్యాచుగా రికార్డు నెలకొల్పింది. మ్యాచ్ ముగిసే సమయానికి హాట్‌స్టార్‌లో వ్యూస్ సంఖ్య 90.1కోట్లకు చేరింది. పోటాపోటీగా సాగిన మ్యాచును వీక్షించేందుకు క్రీడాభిమానులు అమితాసక్తి కనబరిచారు. దీంతో INDvsAUS సెమీ ఫైనల్ మ్యాచ్ వ్యూస్‌ను (66 కోట్లు) ఫైనల్ అధిగమించింది. గత నెల 23న జరిగిన INDvsPAK మ్యాచుకు 60.2కోట్ల వ్యూస్ వచ్చాయి.