News March 20, 2025

నేడు కుటుంబసమేతంగా తిరుమలకు సీఎం

image

AP: ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా నేడు తిరుమలకు వెళ్లనున్నారు. రేపు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించి ఒక్కరోజుకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను టీటీడీకి విరాళంగా ఇవ్వనున్నారు. ఏటా దేవాన్ష్ పుట్టినరోజున చంద్రబాబు ఫ్యామిలీ ఇదే పద్ధతి అనుసరిస్తోంది.

Similar News

News December 5, 2025

ఇవాళ మెగా PTM

image

AP: ఇవాళ మెగా పేరెంట్-టీచర్స్ మీట్ (PTM-3.0) జరగనుంది. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలతోపాటు 45వేల ప్రభుత్వ బడుల్లో ఈ ప్రోగ్రాంను పాఠశాల విద్యాశాఖ నిర్వహించనుంది. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను చూపించి తల్లిదండ్రులతో టీచర్లు మాట్లాడనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని ఆదర్శ పాఠశాలలో CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, దాతలను PTMకు ఆహ్వానించారు.

News December 5, 2025

కోహ్లీ, రూట్ మధ్య సెంచరీల పోటీ!

image

యాషెస్‌లో తాజా టెస్టు సెంచరీతో ఈ ఫార్మాట్లో రూట్ శతకాల సంఖ్య 40కి చేరింది. కాగా రానున్న రెండేళ్లలో సచిన్ రికార్డులు బద్దలుకొట్టేందుకు కోహ్లీ, రూట్ మధ్య సెంచరీల పోటీ నెలకొనే ఛాన్స్ ఉంది. సచిన్‌కు టెస్టుల్లో 51 సెంచరీలుండగా మరో 11 చేస్తే రూట్ ఆయన సరసన నిలుస్తారు. అటు అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీకి 84 శతకాలు పూర్తికాగా, మరో 16 చేస్తే మాస్టర్ బ్లాస్టర్ 100 శతకాల రికార్డును చేరుకుంటారు.

News December 5, 2025

ఉప్పును చేతికి ఇవ్వకపోవడానికి శాస్త్రీయ కారణం

image

ఉప్పుకు తేమను పీల్చుకునే గుణం అధికంగా ఉంటుంది. ఈ కారణం చేతనే ఉప్పును నేరుగా చేతికి ఇవ్వకూడదంటారు. సాధారణంగా చేతిలో చెమట, తడి, బ్యాక్టీరియా ఉంటాయి. ఎవరైనా ఉప్పును చేతితో ఇచ్చినప్పుడు చేతిలో ఉన్న ఆ తేమ, బ్యాక్టీరియాను ఉప్పు గ్రహిస్తుంది. తేమ చేరిన ఉప్పును వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఉప్పు కలుషితం కాకుండా ఉండడం కోసం పెద్దలు దానిని నేరుగా చేతికి ఇవ్వవద్దని చెబుతారు.