News August 7, 2024
వినేశ్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం

వినేశ్ ఫొగట్ కుటుంబాన్ని పంజాబ్ CM భగవంత్ మాన్ పరామర్శించారు. హరియాణాలోని చర్కిదాద్రిలో ఉన్న ఫొగట్ ఇంటికి వెళ్లిన ఆయన నిరాశలో ఉన్న వారిని ఓదార్చారు. ‘కోచ్‌లు, ఫిజియోలు రూ.లక్షల జీతాలు తీసుకుంటున్నారు. వారేమైనా హాలీడే కోసం వెళ్లారా? ఆమె దగ్గరుండి బరువు పరిశీలించడం వారి విధి’ అని అన్నారు. వినేశ్‌కు జరిగిన అన్యాయాన్ని అడ్డుకోవాలని, ఈ విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం ఇష్టం లేదని వ్యాఖ్యానించారు.
Similar News
News November 15, 2025
వట్టి నేలపై కూర్చోకూడదా?

మన శాస్త్రాల ప్రకారం.. వట్టి నేలపై నేరుగా కూర్చోకూడదు. తప్పనిసరిగా వస్త్రం/పీట/ చాపను ఉపయోగించాలి. మన శరీరం విద్యుత్ కేంద్రం వంటిది. భూమికి అయస్కాంత తత్వం ఉంటుంది. నేరుగా కూర్చున్నప్పుడు, మన శరీరంలోని జీవ విద్యుత్ శక్తి భూమిలోకి ప్రసరించి, వృథా అవుతుంది. ఇలా శరీరంలోని శక్తి తగ్గుతుంది. ఆ ప్రభావం మన ఆరోగ్యంపై పడి, వ్యాధులు రావొచ్చు. ఆ శక్తిని కాపాడుకోవడానికి ఈ నియమం పెట్టారు. <<-se>>#Scienceinbelief<<>>
News November 15, 2025
ఇకపై ఎలక్ట్రిక్ బస్సులే కొంటాం: మంత్రి మండిపల్లి

APSRTCని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. ఇకపై డీజిల్ బస్సులను కొనబోమని, రాబోయే మూడేళ్లలో ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే కొనుగోలు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్త్రీ శక్తి పథకం బాగా నడుస్తోందని, దీనిపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లు ఇప్పుడు మౌనం వహించారని ఎద్దేవా చేశారు.
News November 15, 2025
39,506 మారుతీ గ్రాండ్ విటారా కార్లు వెనక్కి

సాంకేతిక సమస్యలు తలెత్తిన గ్రాండ్ విటారా మోడల్ కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. 2024 DEC 9 నుంచి 2025 APR 29 వరకు తయారైన 39,506 కార్లలో సమస్య ఉన్నట్లు వెల్లడించింది. ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్ సిస్టమ్‌లో లోపాలను గుర్తించినట్లు పేర్కొంది. ఆథరైజ్డ్ డీలర్ వర్క్‌షాప్స్‌లో ఆ కార్లను పరీక్షించి లోపాలున్న పరికరాలను ఉచితంగా రీప్లేస్ చేయనున్నట్లు వివరించింది.


