News December 1, 2024
రైతుభరోసాపై క్లారిటీ ఇవ్వని సీఎం!
TG: నిన్న పాలమూరులో జరిగిన రైతు సదస్సులో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. సన్నరకం వరికి బోనస్ ఇస్తుండటంతో రైతు భరోసా నిధులను పక్కనబెట్టేసినట్లేనని ప్రచారం జరుగుతోంది. సీఎం దీనిపై ప్రకటన చేస్తే క్లారిటీ వచ్చేది. కానీ అలాంటిదేమీ జరగలేదు. మరోవైపు రైతులు బోనస్కే ప్రాధాన్యత ఇస్తున్నారని అంతకుముందు మంత్రి తుమ్మల వ్యాఖ్యానించడంతో రైతుభరోసాపై అయోమయం నెలకొంది.
Similar News
News December 1, 2024
కోతికి పంది కిడ్నీ.. 6 నెలలు జీవించిన మంకీ
చైనా సైంటిస్టులు జన్యుసవరణ చేసిన పంది కిడ్నీని కోతికి అమర్చగా అది 6 నెలలకుపైగా జీవించింది. ఒక జాతి అవయవాలను మరో జాతికి మార్చే పరిశోధనలో ఇది కీలక పురోగతి. గతంలో అమెరికా శాస్త్రవేత్తలు పంది గుండెను మనుషులకూ విజయవంతంగా అమర్చారు. అయితే వారు ఎక్కువ కాలం జీవించలేదు. పంది అవయవాలు హ్యూమన్ ఆర్గాన్స్కు సమానమైన పరిమాణంలో ఉంటాయి. దీంతో వీటి అవయవమార్పిడిపై పరిశోధనలు సాగుతున్నాయి.
News December 1, 2024
బాబు ష్యూరిటీ-బాదుడు గ్యారంటీ: అంబటి
AP: విద్యుత్ ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారంటీ.. ఎన్నికల తర్వాత బాబు ష్యూరిటీ-బాదుడు గ్యారంటీ’ అని రాసుకొచ్చారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపైనా ఆయన సెటైర్లు వేశారు. ‘ప్రతి వైన్ షాపునకూ బెల్ట్ ఉంది.. బాబుకే బెల్ట్ లేదు తీయడానికి!’ అని రాసుకొచ్చారు.
News December 1, 2024
టీచర్ల బదిలీల రోడ్ మ్యాప్ ఇదే
AP: ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 25, జనవరి 25, ఫిబ్రవరి 10 తేదీల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ చేస్తారు. ఫిబ్రవరి 15, మార్చి 1, 15 తేదీల్లో సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారు. ఏప్రిల్ 10-15 వరకు HMలు, 21-25 వరకు SA, మే 1-10 వరకు SGTల బదిలీలు పూర్తిచేస్తారు. అలాగే ఏప్రిల్ 16-20 వరకు HMలు, మే 26-30 వరకు SAల ప్రమోషన్లు చేపడతారు.