News February 21, 2025
పోలేపల్లి ఎల్లమ్మ ఆలయంలో CM పూజలు

TG: వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది. కాసేపటి క్రితం పోలేపల్లి ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఆయన పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. సీఎంతో పాటు మంత్రులు ఆలయాన్ని సందర్శించారు. జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
Similar News
News February 22, 2025
రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు.. గడువు పొడిగింపు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 246 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగించింది. ఈ నెల 28 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. జూనియర్ ఆపరేటర్-215, జూనియర్ అటెండెంట్-23, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులు 8 ఉన్నాయి. ఎంపికైన వారికి ఉద్యోగాన్ని బట్టి రూ.23,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం లభిస్తుంది. సీబీటీ, ఇతర టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు.
సైట్: iocl.com
News February 22, 2025
ఎల్లుండి నుంచి ఇస్రో ‘యువికా’ దరఖాస్తుల స్వీకరణ

ఇస్రో నిర్వహిస్తున్న యూత్ సైన్స్ ప్రోగ్రామ్ ‘యువికా’కు రిజిస్ట్రేషన్లు ఈ నెల 24 నుంచి మొదలుకానున్నాయి. వచ్చే నెల 23 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది. 8వ తరగతి పూర్తైన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులు. ఎంపికైన వారికి మే నెలలో 2వారాల పాటు స్పేస్ టెక్నాలజీ, సైన్స్‌లో శిక్షణనిస్తారు.
News February 22, 2025
ఆ రోజున సెలవు

TG: MLC ఎన్నికల నేపథ్యంలో FEB 27న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ టీచర్స్ MLC, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్స్, ఇదే స్థానానికి గ్రాడ్యుయేట్ ఎన్నిక ఆరోజున జరగనుంది. దీంతో ఈ నియోజకవర్గాల పరిధిలోని టీచర్లకు ప్రభుత్వం ప్రత్యేక సెలవు ఇచ్చింది. అటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే గ్రాడ్యుయేట్లు ఓటింగ్‌లో పాల్గొనేలా కంపెనీలు సహకరించాలని ఈసీ కోరింది.