News March 10, 2025
CM చంద్రబాబుపై భూమన విమర్శలు

CM చంద్రబాబుకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు సంక్షేమాన్ని అందివ్వడంలో లేదని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదన్నారు. విద్యార్థుల ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలలు వారిని బయటికి పంపిస్తున్నారని మండిపడ్డారు. 4లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న చంద్రబాబు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారని భూమన ఎద్దేవా చేశారు.
Similar News
News March 10, 2025
పదవులు రాలేదని ఆందోళన చెందొద్దు: లోకేశ్

AP: పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి లోకేశ్ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయని భరోసా కల్పించారు. MLCలుగా బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామని పేర్కొన్నారు. దీంతో బలహీనవర్గాలపై TDP చిత్తశుద్ధి మరోసారి చాటుకుందన్నారు. మహిళలు, యువతను ప్రోత్సహించేందుకే గ్రీష్మకు అవకాశం ఇచ్చామని తెలిపారు. MLA కోటా MLC సీటు ఆశించిన పలువురు సీనియర్లకు నిరాశ ఎదురైన విషయం తెలిసిందే.
News March 10, 2025
ప్రకాశం: కొరియర్ల పేరుతో భారీ స్కాములు

ప్రకాశం జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్తరకం స్కాములకు పాల్పడుతున్నారు. తాజాగా గిద్దలూరులో కొందరికి సైబర్ నేరగాళ్లు స్పీడ్ పోస్ట్‌లో లక్కీ డ్రా గెలుచారని పోస్టు పంపించారు. కొరియర్ తెరిచి చూడగా లక్కీ డ్రాలో రూ.14,49,000 గెలుచుకున్నారని, ఈ డబ్బు అకౌంట్లో బదిలీ చేయాలంటే రూ.15వేల అమౌంట్ బదిలీ చేయాలని కోరుతున్నట్లు సమాచారం. ఇలాంటి వాటిపై స్పందించి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని అధికారులు సూచిస్తున్నారు.
News March 10, 2025
గ్రూప్-1 ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం రిజల్ట్స్ రిలీజ్ చేశారు. అభ్యర్థులు అధికారిక <