News November 10, 2024
సీఎంవోను ముట్టడిస్తాం: వాలంటీర్ల హెచ్చరిక
AP: ఎన్నికల హామీ మేరకు తమను కొనసాగించడంతోపాటు రూ.10వేలకు జీతం పెంచాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. హామీ నెరవేర్చకపోతే అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఐ అనుబంధ AIYF హెచ్చరించింది. ప్రభుత్వ వ్యవస్థలో వాలంటీర్లు లేరని పవన్ కళ్యాణ్ చెప్పడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ విషయంపై త్వరలో సీఎం చంద్రబాబును కలవనున్నట్లు తెలిపారు.
Similar News
News November 13, 2024
రాహుల్కు ఫ్రాడ్.. రేవంత్కు ఫ్రెండ్: KTR
TG: అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘‘అదానీ ఫ్రాడ్’ అని రాహుల్ గాంధీ అంటుంటే, ‘అదానీ నాకు ఫ్రెండ్’ అని రేవంత్ అంటున్నారు. గుజరాత్ మోడల్ బేకార్ అని రాహుల్ అంటే గుజరాత్ మోడల్ బెహతరీన్(అద్భుతం) అని రేవంత్ అంటున్నారు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటుంటే అలాంటి ఫ్రాడ్ దగ్గరికి కాంగ్రెస్ CM రేవంత్ వెళుతున్నారు’’ అని ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో KTR అన్నారు.
News November 13, 2024
‘హ్యారీపోటర్’ను తలపించేలా ‘రాజాసాబ్’: బాలీవుడ్ నిర్మాత
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’పై భారీ అంచనాలే ఉన్నాయి. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాపై బాలీవుడ్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను కొన్ని విజువల్స్ చూశానని, అవి హ్యారీపోటర్ను తలపించాయని అన్నారు. ఇంట్రెస్టింగ్గా అనిపించాయని ప్రశంసించారు. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
News November 13, 2024
ఇవాళ ఇలా చేస్తే పెళ్లవుతుంది!
నేడు క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజు విష్ణువు 4 నెలల తర్వాత యోగ నిద్రలో నుంచి మేల్కొంటారు. ఉదయాన్నే తలంటు స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవాలని పురోహితులు చెబుతున్నారు. ఇవాళ ఇంట్లో తులసి మొక్కకు విష్ణుతో వివాహం జరిపిస్తారు. తులసి కళ్యాణం చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగి, ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని నమ్ముతారు. భార్యాభర్తల మధ్య విబేధాలు ఉంటే సమసిపోతాయని, పెళ్లికాని యువతులకు పెళ్లి జరుగుతుందని నమ్మకం.