News March 29, 2024
‘CMR చెల్లింపు లక్ష్యాన్ని ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలి’
2023- 24 వానకాలం కష్టం మిల్లింగ్ రైస్ చెల్లింపు లక్ష్యాన్ని ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ హరిచందన రైస్ మిల్లర్లను కోరారు. గురువారం ఆమె మిర్యాలగూడ రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 2023- 24 వానాకాలానికి సంబంధించిన సీఎంఆర్ ప్రతిరోజు 4000 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా, మిల్లర్లు 50 శాతం మాత్రమే చెల్లిస్తున్నారని అన్నారు.
Similar News
News January 11, 2025
నల్గొండ: BRS రైతు మహాధర్నా మళ్లీ వాయిదా!
BRS రైతు మహాధర్నా మరోసారి వాయిదా పడింది. నల్గొండ టౌన్లో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. సంక్రాంతి పండుగ ప్రయాణాలు, విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ రద్దీతో పాటు తదితర కారణాలతో పండుగ తర్వాత మహాధర్నా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఫార్ములా ఈ రేసు కేసులో KTR విచారణ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని BRS ముందుకు జరుపుతూ వస్తోంది. తాజాగా ఆయన విచారణ ముగిసిన సంగతి తెలిసిందే.
News January 11, 2025
NLG: జర్మనీలో డ్రైవర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి
జర్మనీ దేశంలో బస్ డ్రైవర్లుగా పనిచేయడానికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ కింద రిక్రూట్మెంట్ ఏజెన్సీ దరఖాస్తులు ఆహ్వానిస్తుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్. పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. బస్ డ్రైవర్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు రెండు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవంతో లైసెన్స్ కలిగి ఉండాలని, 24 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని అన్నారు.
News January 10, 2025
NLG: భర్త బర్త్ డే.. అవయవదానంపై భార్య సంతకం
బర్త్ డే అయితే సాధారణంగా అన్నదానం, పండ్లు పంపిణీ లాంటి కార్యక్రమాలు చేస్తుంటాం. కానీ నల్గొండకు చెందిన శ్రీకాంత్, లహరి దంపతులు వినూత్నంగా ఆలోచించారు. జన్మదినం కావడంతో శ్రీకాంత్ నల్గొండ రెడ్ క్రాస్ భవన్లో రక్తదానం చేయగా, ఆయన భార్య లహరి అవయవ దానం ప్రతిజ్ఞ పత్రాలపై సంతకం చేశారు. వారిని రెడ్ క్రాస్ ఛైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి అభినందించారు.