News January 19, 2025

CMRFతో నిరుపేదలకు ఊరట: షబ్బీర్ అలీ

image

CM రిలీఫ్‌ ఫండ్‌తో నిరుపేదలకు ఎంతో ఊరట కలుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 26 మంది లబ్ధి దారులకు CMRF నుంచి రూ.1.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కులను జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. CM సహాయ నిధి నుంచి మంజూరయ్యే ఆర్థిక సాయం పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతోందన్నారు.

Similar News

News December 19, 2025

ఏబీసీ అవార్డులందుకున్న జిల్లా పోలీసులు

image

కేసుల చేధింపులో రాష్ట్రంలోనే అత్యుత్తమ ప్రతిభ చూపిన రాయదుర్గం అర్బన్, రూరల్ సీఐ జయనాయక్, వెంకటరమణ, వారి సిబ్బంది ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. డీజీపీ చేతుల మీదుగా ప్రతీ ఏడాది టాప్ త్రీ కేసులు చేధించిన వారికి ఏబీసీ అవార్డులు ఇచ్చి సత్కరించడం ఆనవాయితీ. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఎస్పీ జగదీశ్, డీఎస్పీ రవిబాబుతో కలసి డీజీపీ హరీశ్ కుమార్ గుప్త చేతుల మీదుగా వారు అవార్డును అందుకున్నారు.

News December 19, 2025

పార్వతీపురం కలెక్టర్ ఆలోచన రాష్ట్రవ్యాప్తంగా అమలు

image

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అమలు చేసిన ముస్తాబు కార్యక్రమం బాగుందని CM చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రభాకర్‌ను ప్రశంసించిన విషయం తెలిసిందే. రేపట్ని నుంచి ముస్తాబు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాలల వద్దే విద్యార్థుల్ని చక్కగా రెడీ అయ్యేలా చూడటం, క్లాస్ రూంలు, పరిసరాలను శుభ్రం చేయడం చేస్తారు.

News December 19, 2025

ఇండియాకు క్యూ కడుతున్న జపాన్ బ్యాంకులు!

image

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా శ్రీరామ్ ఫైనాన్స్‌లో MUFG బ్యాంక్ ₹40,000 కోట్లతో 20% వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సుమిటోమో మిత్సుయీ, మిజుహో వంటి సంస్థలు కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చాయి. భారత్‌లో అధిక జనాభా, వినియోగదారుల ఖర్చు, లోన్లు తీసుకునేవారు పెరగడం, డిజిటల్ ఎకానమీ వంటి అంశాలు వాటిని ఆకర్షిస్తున్నాయి.