News January 21, 2025

సీఎం దావోస్ పర్యటన.. తొలి ఒప్పందం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం కుదిరింది. వినియోగ వస్తువుల తయారీలో పేరొందిన బ్రాండ్లలో ఒకటైన యూనిలీవర్ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్, కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పింది.

Similar News

News January 22, 2025

27మంది మావోలు మృతి.. మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారి

image

ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27మంది మావోయిస్టులు చనిపోగా, వారిలో ఆ పార్టీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చలపతి(60) ఉన్నారు. ఇతను ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. ఈయనది చిత్తూరు జిల్లా మాటెంపల్లి కాగా, రూ.కోటి రివార్డ్ ఉంది. చలపతి వద్ద ఎప్పుడూ ఏకే 47, ఎస్ఎల్ఆర్ వెపన్స్ ఉంటాయని, చుట్టూ 8- 10 మంది మావోలు సెక్యూరిటీ ఉంటారని సమాచారం.

News January 22, 2025

ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లు మళ్లీ రానున్నాయా?

image

ఇప్పుడంటే ఇంటర్నెట్ సౌకర్యం పెరిగి జాబ్‌ల వివరాలు చేతి వేళ్ల దగ్గరికొచ్చాయి గానీ, 1970, 80 యువతకు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లే దిక్కు. మళ్లీ వాటిని తీసుకొచ్చి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఓ జాబ్ పోర్టల్‌ తీసుకురానున్నట్లు సమాచారం. అందులో ప్రైవేటు కంపెనీలు ఉద్యోగ ఖాళీలను రిపోర్ట్ చేయాలి. మార్గదర్శకాలు పాటించకపోతే చర్యలు తీసుకునే అవకాశముంది.

News January 22, 2025

USA ఊహించినంత ప్రయోజనం ఉండదు: రఘురామ్ రాజన్

image

దిగుమతి సుంకాలు పెంచాలనే USA అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన ప్రపంచ ఆర్థిక అసమానతలకు కారణమవుతుందని RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. విదేశాల్లో వస్తువులు చౌకగా ఉన్నందున వాటిని దిగుమతి చేసుకునేటప్పుడు సుంకాలు పెంచి ప్రయోజనాలను పొందాలని USA చూస్తున్నట్లు తెలిపారు. దీంతో విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. సుంకాలపై అమెరికా ఊహించినంత ప్రయోజనకరంగా ఉండదన్నారు.