News December 22, 2024

సీఎం నిర్ణయం.. ఆ సినిమాలపై ఎఫెక్ట్

image

ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చేది లేదని తెలంగాణ CM రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం ప్రభావం వచ్చే నెలలో విడుదల కానున్న పెద్ద సినిమాలపై పడనుంది. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం మూవీలు రానున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు ఎక్కువ రోజులు ఆడని నేపథ్యంలో బెనిఫిట్ షోల రద్దు నిర్ణయంతో పెద్ద బడ్జెట్ సినిమాలకు షాక్ తప్పదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News December 22, 2024

మలేషియాలోకి భారతీయుల వీసా ఫ్రీ ఎంట్రీ గడువు పెంపు

image

భారత్, చైనా పౌరులకు వీసా రహిత ఎంట్రీ గడువును మలేషియా 2026, డిసెంబరు 21 వరకూ పొడిగించింది. పర్యాటకానికి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీ జనరల్ దాటుక్ అవాంగ్ అలీక్ జెమాన్ ప్రకటించారు. భారత్‌తో పాటు చైనా పౌరులకు వీసా ఫ్రీ ఎంట్రీని గత ఏడాది డిసెంబరు 1న మలేషియా అనౌన్స్ చేసింది. దీని ప్రకారం వీసా లేకుండా నెలరోజుల పాటు ఈ దేశాల పౌరులు మలేషియాలో పర్యటించవచ్చు.

News December 22, 2024

అందుకే వైభవ్‌ను కొనుగోలు చేశాం: సంజూ శాంసన్

image

13 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని IPL వేలంలో రాజస్థాన్ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేయడం వెనుక కారణాన్ని ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఆస్ట్రేలియా-భారత్‌ అండర్-19 టెస్టు మ్యాచ్‌ను మా మేనేజ్‌మెంట్ ప్రత్యక్షంగా చూసింది. చాలా తక్కువ బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇలాంటి ఆటగాడు కచ్చితంగా మాకు ఉండాలని భావించాం. జైస్వాల్, పరాగ్, జురెల్ వంటి ఆటగాళ్లనూ ఇలాగే గుర్తించాం’ అని తెలిపారు.

News December 22, 2024

అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌పై మంత్రి కామెంట్స్

image

TG: ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్ కామెంట్స్ సీఎంను అగౌరవపరిచే విధంగా ఉన్నాయని, వాటిని వెనక్కి తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పర్మిషన్ లేకుండా ఆయన థియేటర్‌కు వచ్చారని, తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య గ్యాప్ లేదని మంత్రి స్పష్టం చేశారు.